ఇందు కోసం మీరు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు కష్టపడితే సరిపోతుంది. చిరుధాన్యాలతో చేసిన బ్రేక్ ఫాస్ట్ ను అందుబాటులో ఉంచడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. చిరుధాన్యాలతో చేసే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం, ఉప్మా, పొంగలి చేసుకుంటే సరిపోతుంది. ఇక చిరుధాన్యాల్లో మీరు కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి వాడుకుంటే సరిపోతుంది.