Gold Rate: చాలా తక్కువ ధరకు బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఈ ఊరికి వెంటనే వెళ్లి షాపింగ్ చేసేయండి..

Published : Apr 06, 2023, 03:24 PM IST

ప్రొద్దుటూరు తో పాటు అటు నెల్లూరులో కూడా మంచి నాణ్యమైన బంగారం లభిస్తుందని పేరు ఉంది. ముఖ్యంగా చెన్నై సహా పలు నగరాల నుంచి నెల్లూరు వచ్చి బంగారం కొనుగోలు చేస్తారు. అందుకే మీరు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ప్రొద్దుటూరు నెల్లూరు వెళ్లి కొనుగోలు చేస్తే నాణ్యమైన మంచి బంగారం లభిస్తుందని పలువురు వర్తకులు పేర్కొంటున్నారు.

PREV
15
Gold Rate: చాలా తక్కువ ధరకు బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఈ ఊరికి వెంటనే వెళ్లి షాపింగ్ చేసేయండి..

బంగారం ధరలు ప్రస్తుతం ఒక తులం రూ. 60000 దాటిపోయింది. దీంతో పసిడి ప్రేమికుల ఆశలు గల్లంతవుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఆల్ టైం గరిష్ట రికార్డుల వద్ద బంగారం ధర ట్రేడ్ అవుతోంది. అయితే ఈ నేపథ్యంలో చిన్న ఉంగరం చేయించుకోవాలన్నా కూడా దాదాపు 75 వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఒక్క గ్రాము కొనాలన్నా కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది మీ ఇంట్లో వివాహ వేడుకలు ఉన్న సమయంలో కచ్చితంగా బంగారం పెట్టాల్సి ఉంటుంది. కనీసం 10 తులాల వరకు అంటే 100 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేసి నగలు చేయించాల్సి ఉంటుంది మరి అలాంటప్పుడు ఒక్క గ్రాము తేడా వచ్చిన భారీగా నష్టపోయే అవకాశం ఉంది. 

25

అందుకే బంగారు నగలు కొనేందుకు ఎక్కడ సరైన ధర లభిస్తుందో అక్కడికి వెళితే మంచిది. అప్పుడే మీరు పెట్టిన పెట్టుబడికి సరైన విలువ దక్కుతుంది. అలాగే పెద్దగా నష్టపోరు.  మీకు నాణ్యమైన మంచి బంగారం కావాలంటే ఏ ముంబై కో ఢిల్లీ కో వెళ్లాల్సిన పనిలేదు.  మన మన ఆంధ్ర ప్రదేశ్ లోనే పొద్దుటూరుకు వెళ్తే సరిపోతుంది.  దేశంలోనే నాణ్యమైన బంగారానికి మన్నికైన డిజైన్లకు ప్రొద్దుటూరు పెట్టింది పేరు.  ఇక్కడి స్వర్ణకారులకు దేశ ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. 
 

35

ప్రొద్దుటూరులో నాణ్యమైన బంగారం లభిస్తుందని దశాబ్దాలుగా పేరు ఉంది తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక తమిళనాడు నుంచి కూడా కస్టమర్లు వచ్చి ఇక్కడ బంగారం నగలు కొనుగోలు చేస్తూ ఉంటారు ముఖ్యంగాబంగారు నగల వ్యాపారంలో ప్రొద్దుటూరు స్వర్ణకారులకు  వందల సంవత్సరాల అనుభవం ఉంది ఒకప్పుడు ప్రొద్దుటూరు స్వర్ణపురి అని పిలిచేవారని పేరు ఉంది.  బంగారం ధరలు ముంబై కన్నా కూడా ప్రొద్దుటూరులోనే తక్కువగా ఉంటాయని పేరుంది.  లోకల్ వ్యాపారస్తులు చాలామంది ప్రొద్దుటూరు ను మినీ ముంబై అని కూడా పిలుస్తూ ఉంటారు.  పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ప్రొద్దుటూరుకు వెళితే సరిపోతుంది హైదరాబాదు నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. 

45

అలాగే ప్రొద్దుటూరుకు కర్నూలు పట్టణం 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నెల్లూరు, కడప నుంచి కూడా రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారికి ప్రొద్దుటూరు సమీపంలోనే ఉంది. అంతేకాదు బంగారం వ్యాపారం చేసే వారు కూడా పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు నుంచే బంగారం కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు బంగారం వ్యాపారం చేసేవారు, ముఖ్యంగా ప్రొద్దుటూరు నుంచే హోల్ సేల్ ప్రాతిపదికన కొనుగోలు చేస్తుంటారు. 
 

55

ప్రొద్దుటూరు తో పాటు అటు నెల్లూరులో కూడా మంచి నాణ్యమైన బంగారం లభిస్తుందని పేరు ఉంది.  ముఖ్యంగా చెన్నై సహా పలు నగరాల నుంచి నెల్లూరు వచ్చి బంగారం కొనుగోలు చేస్తారు.  అందుకే మీరు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ప్రొద్దుటూరు నెల్లూరు వెళ్లి కొనుగోలు చేస్తే నాణ్యమైన మంచి బంగారం లభిస్తుందని పలువురు వర్తకులు పేర్కొంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories