Business Ideas: మహిళలు ఇల్లు కదలకుండా నెలకు రూ. 1 లక్ష సంపాదించాలని ఉందా..అయితే ఈ బిజినెస్ చేసి చూడండి..

Published : Apr 05, 2023, 02:22 PM IST

మహిళలు మీరు ఇంటి వద్ద ఖాళీ సమయాన్ని వినియోగించుకొని డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియాను ఇప్పుడు తెలుసుకుందాం ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు మీరు ఒక లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

PREV
16
Business Ideas: మహిళలు ఇల్లు కదలకుండా నెలకు రూ. 1 లక్ష సంపాదించాలని ఉందా..అయితే ఈ బిజినెస్ చేసి చూడండి..

మహిళలు వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా,  అయితే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ముద్ర యోజన ద్వారా రుణం పొంది మంచి వ్యాపారం ప్రారంభించండి. తద్వారా మీరు ప్రతి నెల ఇంటి వద్ద ఉండే నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ముద్ర రుణాలు అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. బయట ప్రైవేటు వడ్డీల కన్నా కూడా ముద్ర రుణం వడ్డీ చాలా తక్కువ. అలాగే మీరు తిరిగి చెల్లించేటప్పుడు వడ్డీ అసలు రెండు కలిపి EMI పద్ధతిలో తిరిగి చెల్లించవచ్చు. 

26

ఇప్పుడు మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం, తద్వారా మీరు ఇంటి వద్ద ఉండే మంచి ఆదాయం పొందే వీలుంది.  మార్కెట్లో ఎన్ని వస్త్ర దుకాణాలు ఉన్నప్పటికీ,  మహిళలు చీరలు కొనేందుకు ఆసక్తి చూపిస్తూనే ఉంటారు.  అయితే మీరు కూడా చీరల దుకాణం ప్రారంభించే మంచి ఆదాయం పొందే వీలుంది.  

36

ఇందులో కొత్తదనం ఏముందని ఆలోచిస్తున్నారా..  అయితే తెలుసుకోండి.  వివాహ శుభకార్యాలలో పట్టుచీరలను కట్టుకోవడం మన సాంప్రదాయం.  ఈ పట్టు చీరలు చాలా ఖరీదైనవి గా ఉంటాయి ముఖ్యంగా కంచి పట్టు చీరలు 5000 నుంచి లక్ష రూపాయల వరకు ఖరీదు చేస్తాయి.  ఇక పెళ్లిళ్లలో పెళ్లికూతురు ధరించే చీర కనీసం పదివేల నుంచి పాతిక వేల వరకు ఉంటుంది.  మరి అంత డబ్బు చెల్లించి ఒకేసారి చీర కొనడం ఎవరికైనా ఆర్థికంగా భారమే కనుక  దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.  ఖరీదైన చీరలను విక్రయించి వారి వద్ద నుంచి నెల వాయిదాల రూపంలో డబ్బు వసూలు చేసుకుంటే సరిపోతుంది. 

46

ఉదాహరణకు ఒక కంచి పట్టుచీర ధర 20000 అనుకుంటాం నెలకు 2000 చొప్పున కిస్తీ కట్టి వసూలు చేసుకుంటే ఏడాదిలోగా సులభంగా తీర్చేయవచ్చు.  ఇందులో మీరు మీ లాభాన్ని కూడా జోడిస్తే మీ పెట్టుబడి కన్నా ఎక్కువ డబ్బే మీ చేతికి ముడుతుంది. అయితే ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు షాపుతో పనిలేదు ఇంటి వద్ద ఉండే మీరు ఈ వ్యాపారం చేయవచ్చు మీ తెలిసినవారు పరిచయస్తులకు ఖరీదైన చీరలను విక్రయించి వారి వద్ద నుంచి నెల వాయిదాల రూపంలో డబ్బులు వసూలు చేస్తే సరిపోతుంది తద్వారా కొన్నవారికి సంతృప్తి దక్కుతుంది అలాగే మీరు కూడా మంచి లాభం పొందే అవకాశం ఉంది.  
 

56

ఖరీదైన కంచి పట్టు చీరలు కొనుగోలు చేయాలంటే మీరు తమిళనాడులోని కాంచీపురంకు వెళ్తే సరిపోతుంది అక్కడ హోల్ సేల్ రేట్ల వద్ద మీకు చీరలు అమ్ముతారు. వాటిని కొనుగోలు చేసి మీరు మీ లాభాన్ని జోడించి విక్రయించుకోవచ్చు.

66

అయితే నమ్మకస్తులు, ఉద్యోగస్తులు, ఆదాయ వనరులు ఉన్నవారికి మాత్రమే చీరలను విక్రయించండి. లేకపోతే ఆర్థికపరమైన చిక్కుల్లో మీరు ఇరుక్కునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఈ వ్యాపారం చేసుకుంటే ప్రతి యేటా మీ పెట్టుబడి పై కనీసం 50 శాతం వరకు లాభం పొందే అవకాశం ఉంది.
 

Read more Photos on
click me!

Recommended Stories