Today Gold Price: కుప్పకూలిపోయిన పసిడి, ట్రంప్ వ్యాఖ్యలతో మార్కెట్లు ఢమాల్

Published : Apr 02, 2026, 10:53 AM IST

Today Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రెండ్రోజులుగా పెరిగిన పసిడి ధరలు...మళ్లీ తగ్గడం మొదలైంది. ట్రంప్ వ్యాఖ్యలతో గోల్డ్, సిల్వర్ రేట్లపై భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది. మరోసారి ధరలు కుప్పకూలిపోయాయి. 

PREV
13
ట్రంప్ వ్యాఖ్యలతో కుప్పకూలిన బంగారం, సిల్వర్

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు భారీగా తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‍పై ట్రంప్ యుద్ధం ప్రకటించడంతో పసిడి, సిల్వర్ ధరలు భారీగా కుప్పకూలిపోయాయి.

23
రూ.1,51,420కు చేరిన పసిడి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‍లో కొన్ని రోజులుగా పెరుగుతూ వచచిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,530 తగ్గి రూ.1,51,420కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,400 పతనమై రూ.1,38,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.10 వేలు తగ్గి రూ.2.55లక్షల వద్ద ఉంది. 

33
ఇరాన్‍పై యుద్ధానికి సిద్ధమైన ట్రంప్

ఇరాన్‍తో డీల్ గురించి మాట్లాడుతూనే ట్రంప్ ప్రపంచాన్ని నట్టేట ముంచుతున్నారు. ఓ వైపు యుద్ధం ఆపేస్తామని ప్రకటిస్తూనే ...ఇరాన్ తమ మాట వినకపోతే కుదరదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు 2, 3 వారాల్లో యుద్ధం ముగిస్తాం, గానీ ఈ 2, 3 వారాలు మాత్రం భీకర దాడులు జరుగుతాయన హెచ్చరిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. అయితే ఇరాన్ నుంచి చమురు కొనడం మానేసి తమ దగ్గర కొనుక్కోవాలని రెచ్చెగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories