Gold price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...మూడో రోజు బంగారం ధరలకు బ్రేక్..దిగొచ్చిన గోల్డ్

Published : Sep 29, 2026, 10:49 AM IST

Gold price Fall: బంగారం ధరల్లో గత కొన్ని రోజులుగా కనిపించిన హెచ్చుతగ్గులకు బ్రేక్ పడింది. ఒక రోజు తగ్గుతూ, మరో రోజు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు వరుసగా మూడో రోజు భారీగా పడిపోయాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.

PREV
14
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

ప్రపంచ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావం బంగారం ధరలపై కనిపిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అదే సమయంలో అమెరికా డాలర్ విలువ బలపడటం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతోంది.

24
ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం

చమురు ధరలు పెరిగితే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్లలో వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు ఇప్పటికే పెరిగిన బంగారం ధరలను సద్వినియోగం చేసుకుంటూ లాభాల స్వీకరణకు దిగుతున్నారు.

34
మార్కెట్లో పసిడికి డిమాండ్

ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించడంతో మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గుతోంది. దీంతో ధరలపై అమ్మకాల ఒత్తిడి పెరిగి వరుసగా మూడో రోజు బంగారం రేట్లు భారీగా తగ్గాయి.

మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ సుమారు 670 పాయింట్లు నష్టపోయి 72,100 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి 22,580 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

44
రూ.1,48,800కు దిగొచ్చిన పసిడి

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,250 తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.1,36,400కు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,370 తగ్గి రూ.1,48,800కు చేరుకుంది.

మూడో రోజు బంగారం ధరలు భారీగా తగ్గడం పసిడి కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్, డాలర్ కదలికలు, ద్రవ్యోల్బణ అంచనాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు రాబోయే రోజుల్లో బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories