బంగారం ధరలు పెరగడానికి కారణాలు
బంగారం ధరలు ఇలా రికార్డులు బద్దలుకొట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం, ఇంకా అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో కొన్ని దేశాలు బంగారం రూపంలో ఆర్థిక నిల్వలను ఉంచుకోవాలని చూస్తుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడం కూడా బంగారం ధరలపైన ప్రభావం చూపుతోంది. వీటికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, ప్రకటనలు బంగారం ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.