బంగారం కొనేందుకు మంచి ఛాన్స్.. నిలకడగా పసిడి ధరలు.. వెండి వెలవెల

First Published Oct 12, 2021, 12:49 PM IST

దసరా, దీపావలీ పండుగ సీజన్​ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొద్ది రోజులుగా కాస్త పెరుగుతూ, తగ్గుతూ వ‌చ్చిన పసిడి ధ‌ర‌లు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైనది, మహిళలు ఇష్టపడేది బంగారం. 

 సాధారణ రోజుల్లో అలాగే పెళ్లిళ్ల సీజన్ లో కంటే దసరా, దీపావళి పండుగ సీజన్ లో  బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే కొన్ని రోజులుగా బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికి కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా నమోదయ్యాయి. 

ఈ రోజు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ .47137 కి చేరుకుంది. మరోవైపు సిల్వర్ ఫ్యూచర్ ధర కిలో రూ. 61724 వద్ద స్థిరంగా ఉంది. గత సంవత్సరం గరిష్ట స్థాయి 10 గ్రాములకు రూ. 56,200 నుండి పసుపు లోహం ఇప్పటికీ రూ .9,063 తగ్గింది. గత సంవత్సరం కంటే ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ మంది కస్టమర్‌లు వస్తారని దేశీయ డీలర్లు భావిస్తున్నారు.  

  గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు ఈరోజు ఫ్లాట్ గా ఉన్నాయి.స్పాట్ బంగారం ఔన్సు కి  1,753.77 డాలర్ల వద్ద ఫ్లాట్ అయింది. ఇతర విలువైన లోహాలలో స్పాట్ సిల్వర్ ఔన్స్ 0.2 శాతం తగ్గి 22.52 డాలర్లకు, ప్లాటినం 0.5 శాతం తగ్గి 1003.87 డాలర్లకు చేరుకుంది.  

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250 ఉంది. 
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,420 ఉంది. 
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది. 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890 ఉంది. 

వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి (silver) రూ.62,000 ఉండగా, చెన్నైలో రూ.65,900 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.65,900 ఉండగా, కోల్‌కతాలో రూ.62,000 ఉంది. 

తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్లకు రూ. 43,900 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,890 కి చేరింది. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 65,800 వద్ద ఉంది.

బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.

click me!