Today Gold Rate: మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్‌కు చేరగా... బంగారం ధరలు మాత్రం ఊహించని విధంగా తగ్గాయి. సోమవారం మార్కెట్లు తెరుచుకున్నాక మళ్లీ భారీ షాక్ తప్పదా?
ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య... దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. సాధారణంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగితే బంగారం ధరలు పెరగడం చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం శనివారం మార్కెట్‌లో ధరలు కొద్దిగా దిగివచ్చాయి. ముందుగా తాజా ధరల విషయానికి వస్తే...శనివారం ఉదయం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,220గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.380 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,32,200గా ఉంది. ఇది కూడా రూ.350 తగ్గింది. ఈ తగ్గుదల పెద్దది కాకపోయినా... మార్కెట్ దృష్టి మాత్రం ఇప్పుడు పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలపైనే ఉంది.
24
ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తత
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. సముద్ర మార్గాల భద్రత, చమురు రవాణా, సైనిక కదలికలు... ఇవన్నీ ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపే అంశాలుగా మారాయి. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం... అమెరికా ఇరాన్‌లోని విద్యుత్ మౌలిక సదుపాయాలు, పవర్ ప్లాంట్లు, రిఫైనరీలపై లక్ష్యిత దాడుల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక నిర్ణయం వెలువడలేదు.
34
చూస్తూ ఊరుకోం
అమెరికా తీసుకునే ఏకపక్ష చర్యలకు తాము ప్రతిస్పందిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో ప్రపంచ మార్కెట్లు మరింత అప్రమత్తంగా మారాయి.అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బంగారం ధరలు ఎందుకు తగ్గాయి అనే సందేహం చాలా మందికి వస్తోంది. దీనికి ప్రధాన కారణం... శనివారం దేశీయ బులియన్ మార్కెట్‌లో సాధారణ ట్రేడింగ్ మాత్రమే ఉండటం, అలాగే అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం. పెట్టుబడిదారులు కూడా సోమవారం మార్కెట్లు తెరుచుకునే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
కానీ ఒకవేళ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే... ప్రపంచవ్యాప్తంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పైకి వెళ్లే అవకాశాన్ని విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు. అదే సమయంలో... పరిస్థితులు చర్చల ద్వారా సద్దుమణిగితే లేదా పెద్ద ఎత్తున సైనిక చర్యలు జరగకపోతే... ధరల్లో స్థిరత్వం లేదా స్వల్ప మార్పులు కనిపించే అవకాశం కూడా ఉంది.