Gold price: బంగారం కొనేందుకు ఇదే స‌రైన స‌మ‌యం.. భారీగా ప‌త‌న‌మ‌వుతోన్న ధ‌ర‌లు.

Published : Jun 25, 2025, 10:18 AM IST

గ‌త కొన్ని రోజులుగా ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోయిన బంగారం ధ‌ర‌ల్లో కాస్త త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. మారుతోన్న ప్ర‌పంచ పరిణామాల నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. తాజాగా బుధ‌వారం కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. 

PREV
18
దేశవ్యాప్తంగా త‌గ్గిన ధ‌ర‌లు

మంగ‌ళ‌వారం ఒక్క రోజే తులంపై ఏకంగా రూ. 820 త‌గ్గ‌గా తాజాగా బుధ‌వారం సైతం బంగారం ధ‌ర‌లో త‌గ్గుద‌ల క‌నిపించింది. ఈరోజు తులం బంగారంపై రూ. 270 త‌గ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 98,950కి దిగొచ్చింది.

చాలా రోజుల త‌ర్వాత తులం బంగారం ధ‌ర రూ. 98 వేల మార్క్‌కి చేరుకోవ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఇక వెండి ధ‌ర‌లు కూడా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కిలో వెండిపై రూ. 1000 త‌గ్గింది. దీంతో ప్ర‌స్తుతం కిలో వెండి ధ‌ర రూ. 1,08,000 వ‌ద్ద కొన‌సాగుతోంది.

28
దేశంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 99,100గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90,850 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,950, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 90,700 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* చెన్నైలో బుధ‌వారం 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,950గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90,700గా ఉంది.

* బెంగ‌ళూరు విష‌యానికొస్తే ఇక్క‌డ 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,950 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90,700 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* కోల్‌క‌తాలో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 98,950 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90,700గా ఉంది.

38
తెలుగు రాష్ట్రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?

* హైద‌రాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,950గా ఉండ‌గా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90,700 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విజ‌య‌వాడ‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,950గా ఉండ‌గా, 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 90,700గా ఉంది.

* విశాఖ‌ప‌ట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,950గా ఉండ‌గా, 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 90,700 వ‌ద్ద కొన‌సాగుతోంది.

48
బంగారం ధ‌ర‌లు ఎందుకు త‌గ్గుతున్నాయి.?

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంతవరకు తగ్గినట్లు కనిపిస్తోంది. పశ్చిమాసియా మాత్రమే కాదు, గ్లోబల్‌ స్థాయిలో ఆందోళన రేపిన ఈ పరిస్థితులు, ఇప్పుడు కాస్తా మామూలు బాటలోకి వస్తుండటంతో పెట్టుబడిదారుల ఆలోచ‌న‌లు మారుతున్నాయి. ఈ కార‌ణంగానే బంగారం ధరలు తగ్గుముఖం ప‌డుతున్న‌ట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

58
యుద్ధం భ‌యంతో

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ దేశాలు పరస్పర దాడులతో తీవ్ర హింసకు తెరలేపిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో అమెరికా కూడా పరోక్షంగా జోక్యం చేసుకోవడంతో అంతర్జాతీయంగా అస్థిరత పెరిగింది. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లలో నష్టాల భయంతో మదుపరులు భద్రమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకున్నారు.

అయితే ఇటీవల కాల్పుల విరమణపై వచ్చిన వార్తలు మదుపరుల ధోరణిలో మార్పుకు దారితీశాయి. ఈక్విటీ మార్కెట్లపై నమ్మకంతో వారు మళ్లీ వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గోల్డ్‌ డిమాండ్‌ తగ్గడంతో ధరలు క్షీణించాయి.

68
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర తగ్గుదల

గ్లోబల్‌ గోల్డ్‌ మార్కెట్‌ కూడా ఇదే ధోరణిని సూచిస్తోంది. బంగారంతో పాటు వెండిలోనూ తగ్గుదల కనిపిస్తోంది. ఔన్స్‌ గోల్డ్‌ ధర 46.05 డాలర్లు తగ్గి 3,323.05 డాలర్లకు పరిమితమైంది. ఇది సుమారుగా 1.37 శాతం తక్కువ. ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధానంపై పెట్టుబడిదారులు ప్రత్యేకంగా దృష్టిపెడుతున్న పరిస్థితుల్లో గోల్డ్‌ మార్కెట్‌ తిరుగుదల మొద‌లైంది.

78
బంగారం ధ‌ర‌లు మ‌రింత త‌గ్గుతాయా.?

వడ్డీరేట్ల కోతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నోసార్లు సూచనలు చేసినా, ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ మాత్రం ఇప్పటికీ దానికి అంగీకరించలేదు. తాము ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తున్నామని, వడ్డీరేట్లపై తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు మరింతగా తగ్గుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

88
వడ్డీరేట్లు, గోల్డ్‌ ధరల మధ్య సంబంధం

సాధారణంగా వడ్డీరేట్లు తగ్గితే బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయి. ఫలితంగా ధరలు పెరుగుతాయి. అయితే వడ్డీరేట్లు పెరిగితే పెట్టుబడిదారులు ఈక్విటీలకు ప్రాధాన్య‌త ఇచ్చే అవకాశం ఉండటం వల్ల గోల్డ్‌ డిమాండ్‌ తగ్గుతుంది. ఇదే పరిస్థితి ప్రస్తుత గోల్డ్‌ మార్కెట్‌లో కనబడుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories