Gold Rate: బంగారం కొనడం, అమ్మడం ఇప్పుడు ఎక్కువైపోయింది. బంగారం రేటు పెరిగినప్పటి నుంచి అమ్మే వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే బంగారం కొన్నప్పుడు కన్నా బంగారం అమ్మినప్పుడు దాని ద్వారా తక్కువగా ఉంటుంది.
బంగారం ధరలు పెరగడంతో ఎంతో మంది తమ అవసరాలకు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం లేదా అమ్మడం వంటివి చేస్తున్నారు. బంగారం కొన్నప్పుడు ఎక్కువ ధర ఇచ్చి కొని.. మనం అమ్మినప్పుడు మాత్రం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. బంగారు షాపులో ఒక నెక్లెస్ రెండు లక్షల రూపాయలకు కొంటె.. దాన్ని అమ్మితే మాత్రం లక్షన్నర రూపాయలు మాత్రమే రావచ్చు. అందుకే పాత బంగారాన్ని అమ్మితే అదే పరిమాణంలో కొత్త బంగారాన్ని పొందడం చాలా కష్టం.
24
బంగారం స్వచ్ఛతను బట్టి
కొత్త బంగారు ఆభరణాలు కొనేటప్పుడు బంగారం స్వచ్ఛతను బట్టి ధర ఉంటుంది. ఆ బంగారు ఆభరణం పై జీఎస్టీ కూడా చెల్లించాలి. అలాగే అది దాని డిజైన్, అందులో పొదిగిన రత్నాలను బట్టి మేకింగ్ ఛార్జీలను వసూలు చేస్తారు. దీని వల్లే కొత్త బంగారు ఆభరణాలు కొన్నప్పుడు అదనపు ఛార్జీలు అన్ని కలిపి ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తుంది. కానీ అమ్మినప్పుడు మాత్రం అలా కాదు.
34
అమ్మితే ధర ఇందుకే తగ్గుతుంది
ఒక పాత బంగారు ఆభరణాన్ని తీసుకెళ్లి అమ్మడానికి ప్రయత్నిస్తే బంగారం బరువు, దాని స్వచ్ఛత మాత్రమే కొలుస్తారు. అంతే తప్ప దానితో మేకింగ్ ఛార్జీలు, జిఎస్టి, దాని డిజైన్ కి అయిన ఖర్చు వంటివి లెక్కించరు. అందుకే పాత బంగారు ఆభరణాలు అమ్మితే కొత్త బంగారం ఆభరణాలతో పోలిస్తే ఐదు శాతం నుంచి ఎనిమిది శాతం ధరలో తగ్గింపు కనిపిస్తుంది.
మీరు బంగారం కొనుగోలు చేసేటప్పుడే BSI హాల్ మార్క్ ఉన్న ఆభరణాలను కొంటే మంచిది. ఇది స్వచ్ఛతకు సంబంధించిన ముద్ర. మీరు బంగారు ఆభరణాలను పెట్టుబడి రూపంలో కొనాలనుకుంటే నాణాలు, కడ్డీల రూపంలో కొంటేనే మంచిది. ఇది ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. అలాగే తయారీ అంటే మేకింగ్ ఛార్జీలు కూడా తక్కువ పడతాయి. తిరిగి అమ్మినప్పుడు అంతే ధరకు అవి అమ్ముడయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఆభరణాల రూపంలో కొంటె మాత్రం తయారీ ఛార్జీలు, జీఎస్టీ వంటివన్నీ తగ్గించి కేవలం బంగారానికి మాత్రమే విలువ కడతారు.