Pets in Train: మీ పెంపుడు జంతువులను రైలులో తీసుకువెళ్లాలనుకుంటున్నారా? ఇలా టికెట్ బుక్ చేయండి

Published : Nov 21, 2025, 04:29 PM IST

Pets in Train: ఎంతోమందికి ఇళ్లల్లో పెంపుడు జంతువులు ఉంటాయి. తాము టూర్లకు వెళ్ళినప్పుడు వాటిని ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతారు. మరికొంతమంది వాటిని తమతో పాటూ తీసుకువెళ్లాలనుకుంటారు. అలాంటివారు రైలులో వాటిని ఎంచక్కా తీసుకు వెళ్ళవచ్చు.  

PREV
14
ట్రైన్లో పెంపుడు జంతువులు

మనదేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే క్రిస్మస్ సెలవులు, కొత్త ఏడాది సెలవులు వచ్చేస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు టూర్లు వెళ్లేందుకు ప్లానింగ్ చేస్తారు. కానీ తమ దగ్గర ఉన్న పెంపుడు జంతువులను ఏం చేయాలో వారికి అర్థం కాదు. మరి కొంతమంది తమతో పాటు వాటిని తీసుకెళ్లాలనుకుంటారు.

24
రూల్స్ ఏం చెబుతున్నాయి?

భారతీయ రైల్వే రూల్స్ ప్రకారం మీరు పెంపుడు జంతువులను మీతో పాటు రైలులో తీసుకు వెళ్ళవచ్చు. ట్రైన్ లో కుక్కలు, పిల్లులు అంటే చిన్న పెంపుడు జంతువులను తీసుకెళ్లడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే వాటికి కూడా ప్రత్యేకంగా టికెట్‌ను బుక్ చేయాలి. స్లీపర్, థర్డ్ ఏసి, సెకండ్ ఏసిలలో పెట్స్ కు ఎలాంటి అనుమతి లేదు. కానీ ఫస్ట్ ఏసి లలో మాత్రం పెట్స్ తో పాటు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. నాలుగు బెర్తుల ఫస్ట్ కూపే, క్యాబిన్‌ను పూర్తిగా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదా రెండు బెర్తుల కూపేను పూర్తిగా బుక్ చేసుకుని మీతో పాటు కుక్కలు లేదా పిల్లులను తీసుకువెళ్ళవచ్చు.

34
అనుమతి తీసుకోవాలి

క్యాబిన్ పూర్తిగా తీసుకోవడం కోసం మీరు డివిజనల్ రైల్వే మేనేజరు లేదా జనరల్ మేనేజర్ కార్యాలయానికి మీ రిక్వెస్ట్ చేయాలి. అప్పుడు రైల్వే శాఖ మీరు రిక్వెస్ట్ ను పరిగణంలోకి తీసుకుంటుంది. చిన్న కుక్కలు, పిల్లులు తీసుకెళ్లడానికి సాధారణ బుకింగ్ చార్జీలే అవసరం పడతాయి. వాటిని ఏ తరగతులోలైన తీసుకువెళ్ళవచ్చు. అయితే అవి చాలా చిన్నగా ఉండాలి. అదే పెరిగిన శునకాల అయితే మాత్రం పూర్తిగా ఫస్ట్ ఏసీ కూపే లోనే తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

44
ఇలా టికెట్ బుక్ చేసుకోండి

మీరు ఐఆర్సిటిసిలో మీ పెంపుడు కుక్కలకు టికెట్స్ బుక్ చేయవచ్చు. ఇందుకోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి వెళ్లాలి. ట్రైన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డాగ్స్ అండ్ క్యాట్స్ బుకింగ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. దానిమీద క్లిక్ చేయగానే మీరు నేరుగా రైల్వే పార్సెల్ వెబ్ సైట్ లోకి నావిగేట్ అవుతారు. అక్కడ మీ ఫోన్ నెంబరు ఇవ్వాలి. మీకు వచ్చిన ఓటీపీ, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత మీరు బుక్ చేసుకున్న పిఎన్ఆర్ నంబర్ ను కూడా అక్కడ ఇవ్వాలి. మీరు బుక్ చేసుకున్న బెర్త్ పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు అర్హత ఉందో లేదో అక్కడ చెక్ చేయాలి. అర్హత ఉంటే మీరు ఎన్ని కుక్కలను లేదా పిల్లులను తీసుకువెళ్తున్నారో ఎంపిక చేసుకోవాలి. తర్వాత పేమెంట్ బటన్ పై క్లిక్ చేసి ఫీజును చెల్లించాలి. పేమెంటు సక్సెస్ అయ్యాక లగేజీ టికెట్ నెంబర్ వస్తుంది. అది మీ మెయిల్ ఐడీకి కూడా వస్తుంది.

అయితే మీరు ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే మీ బెర్తు వరకు మాత్రమే రిఫండ్ వస్తుంది. పెంపుడు జంతువులకు బుక్ చేసిన లగేజీ టికెట్లకు మాత్రం ఎలాంటి రిఫండ్ రాదు.

Read more Photos on
click me!

Recommended Stories