బంగారం ఏకంగా 55 వేలు దాటేసింది..ఇక మహిళలకు కన్నీళ్లే, త్వరలోనే 10 గ్రాముల పసిడి రూ.65 వేలు దాటేస్తుందా..?

First Published Jan 6, 2023, 2:22 PM IST

మహిళలు ఎంతో ఇష్టపడి చేయించుకునే బంగారు నగలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి.  తాజాగా బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకింది.  ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 55 వేలు దాటింది. 

బంగారంపై మళ్లీ బుల్లిష్ ట్రెండ్ మొదలైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, చైనా, భారత్‌ల నుంచి డిమాండ్ పెరగడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా బంగారం, వెండిలో త్వరలో కొత్త గరిష్ఠ స్థాయి కనిపించనుందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.
 

పెట్టుబడికి సురక్షిత స్వర్గధామంగా భావించే బంగారంపై మళ్లీ బుల్లిష్ ట్రెండ్ మొదలైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, చైనా, భారత్‌ల నుంచి డిమాండ్ పెరగడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా బంగారం, వెండిలో త్వరలో కొత్త గరిష్ఠ స్థాయి కనిపించనుందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు.
 

హైదరాబాద్ లో బంగారం ధర 10 గ్రాములకు రూ.500 పెరిగి రూ.54,680 నుంచి రూ.55,200కి చేరుకుంది, ఇది రెండేళ్లలో అత్యధిక స్థాయి. రజతం 1500 ఎగబాకి 69,000 స్థాయిని దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు (31 గ్రాములు) 1840 డాలర్లు పలుకుతోంది. స్థిరంగా పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం కారణంగా  హెడ్జ్ ఫండ్స్-సెంట్రల్ బ్యాంకులు బంగారం వైపు ఆకర్షితులవడంతో పెట్టుబడులు బంగారం వైపు కదులుతున్నాయి. ఇది కాకుండా, చైనా, రష్యా, యూరప్, జర్మనీలలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరగడం వల్ల బంగారం మార్కెట్‌కు మద్దతు లభిస్తోంది. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో మందగమనం కూడా బంగారం పెరుగుదలకు కారణం అయ్యింది.  అంతర్జాతీయ మార్కెట్ల కంటే దేశీయ మార్కెట్‌లో ధరలు వేగంగా పెరిగిన కారణంగా రూపాయి విలువ 83 స్థాయిలను తాకినట్లు బులియన్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. 
 

బంగారం ధర విజృంభణకు ప్రధాన కారణాలు
>> 2023 మొదటి ఆరు నెలల ప్రభావం ప్రపంచ స్థాయిలో మాంద్యం ప్రభావం భారీగా పడుతోంది. 
>> డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత కొనసాగడం, రూపాయి 83 కి పడిపోవడంతో, బంగారం బూమ్ వేగవంతం అవుతోంది.
>> చైనా-భారత్ నుండి నిరంతరం పెరుగుతున్న డిమాండ్, దేశంలో ఆభరణాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
>> సెంట్రల్ బ్యాంకుల బంగారం బాండ్లను భారీగా కొనుగోలు పెరగడం, గోల్డ్ ఇటిఎఫ్-ఎస్‌పిడిఆర్ ట్రేడెడ్ ఫండ్‌లకు డిమాండ్ పెరగడం.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కంటే వెండిలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 5G టెక్నాలజీతో పాటు ఇతర సాంకేతికత, పారిశ్రామిక విభాగాల్లో వెండికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వెండి ఇటిఎఫ్‌లలోకి పెట్టుబడిదారుల ప్రవేశాల మద్దతుతో లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో వెండి స్టాక్‌లు దిగువకు చేరుకున్నాయి. 
 

దీపావళి నాటికి తులం బంగారం 65 వేలు
దేశీయ మార్కెట్‌లో దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం రూ.60-65,000 కొత్త శిఖరాన్ని తాకవచ్చు.  ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం చివరి నాటికి వెండి కేజీ ధర రూ. 90,000కి చేరవచ్చని- అజయ్ కేడియా, కేడియా కమోడిటీస్ లిమిటెడ్ పేర్కొన్నారు. 

ధర పెరుగుతున్నప్పటికీ, ఇప్పుడు బంగారం కొనుగోళ్లు వేగం తగ్గే సూచనలు కనిపించడం లేదు. గత కొంత కాలంగా ఇది నిరంతరం పెరుగుతూ వస్తున్నందున, కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండవచ్చు. కొత్త ఇన్వెస్టర్లతో పాటు కొనుగోలుదారులకు కూడా ఈ సమయం మంచి సమయమని విశ్లేషకులు చెబుతున్నారు. 

click me!