బంగారాన్ని మీరు కావాలనుకుంటే ప్రతి నెల సిప్ పద్ధతిలో, కొంచెం కొంచెం డబ్బు జమ చేసుకొని సంవత్సరంలో ఒకసారి బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు బ్యాంకులో రికరింగ్ డిపాజిట్లు ఖాతాను ఓపెన్ చేసి ప్రతి నెల అందులో నిర్ణీత మొత్తంలో డబ్బు దాచుకొని, ఆ డబ్బు మెచ్యూరిటీ అయ్యాక దాంతో మీరు బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. మీరు పొదుపు చేసిన డబ్బుపై వడ్డీ కూడా లభిస్తుంది తద్వారా మీరు లాభం పొందే అవకాశం ఉంది.