దేశంలోని ప్రముఖ నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 57,310 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 52,550. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 57,160 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 52,400.
మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.57,160 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,400గా ఉంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 55,600 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.52,950.
ఇక 1 కేజీ వెండి ధర గత 24 గంటల్లో రూ.200 వరకు తగ్గింది. దేశ రాజధాని నగరంలో వెండి ధర కిలోకు రూ. 71,100.
విజయవాడలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. రేట్ల ప్రకారం చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పతనంతో రూ. 52,390, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పతనంతో రూ. 57,150. వెండి చూస్తే విజయవాడలో వెండి ధర కిలోకు రూ. రూ. 73,500.
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1820 డాలర్ల వద్ద, ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు $20.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ ఇవాళ రూ.83.278 వద్ద ఉంది.
ఈ రోజు హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు వరుసగా దిగొచ్చాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పతనంతో రూ. 52,390 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పతనంతో రూ. 57,150. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ. 73,500.
గత రెండు వారాల్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు దాదాపు రూ. 60,000 నుండి పడిపోయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.55,000 నుండి దిగొచ్చింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ఎప్పుడైనా ధరలు మారవచ్చు, అందువల్ల బంగారం కొనేవారు ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. ఇందుకోసం దగ్గరలోని జ్యువెలరీ షాపులను సంప్రదించవచ్చు.
గత కొద్దీ రోజులుగా పసిడి ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు భారీ ఊరటగా చెప్పవచ్చు. ఇక గడిచిన 10 రోజుల్లో తులం బంగారం ధర ఏకంగా రూ.2700 దాకా తగ్గిందని చెప్పవచ్చు.