మెరుపు వేగంతో పెరిగిన బంగారం ధర.. షాక్ తిన్న జనం.. ఒక్కరోజే తులం ఎంత పెరిగిందంటే..?

First Published | Oct 20, 2023, 12:45 PM IST

నేడు బంగారం  ధర ఇండియాలో ఆల్ టైమ్ హైకి చేరింది. అంటే ఈరోజు ఒక్క రోజే  బంగారం ధర దాదాపు  రూ.600 దాకా  పెరిగింది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధానికి ప్రతిగా భారత్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దింతో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న జనం షాక్ అయ్యారు.
 

రానున్న దసరా, దీపావళి వంటి పండుగల కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతుందని భావించిన ఈ ధరల పెరుగుదల పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేసింది. గత 10 రోజుల్లో బంగారం ధర రూ.2,300 పెరిగింది.

అయితే నేడు  బంగారం ధర భారీగా పెరగగా, వెండి ధర మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఒక కిలో వెండి ధర రూ.77,500.
 

ఈ రోజు ఢిల్లీలో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 700 పెంపుతో రూ. 56,550, 24 క్యారెట్ల పది గ్రాముల ధర   రూ. 780 పెంపుతో రూ. 61,650. ఇక దేశ రాజధాని నగరంలో వెండి ధర కిలోకు  రూ.74,100.
 


ప్రముఖ  నగరాల్లో బంగారం, వెండి ధరలు

ముంబైలో బంగారం (10 గ్రాముల 22 క్యారెట్లకు) ధర రూ.56,400, వెండి (కిలోకి) ధర రూ.74,100

కోల్‌కతాలో బంగారం (10 గ్రాముల 22 క్యారెట్లకు) ధర రూ.56,400, వెండి (కిలోకి) ధర రూ.74,100

చెన్నైలో బంగారం (10 గ్రాముల 22 క్యారెట్లకు) ధర రూ.56,600, వెండి (కిలోకి) ధర రూ.77,500

భారతదేశంలో బంగారం, వెండి ధరలు డాలర్‌తో రూపాయి మారకం విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన లోహాల రేటులో గమనించిన ధోరణులను నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
 

తాజా నివేదిక ప్రకారం, 0332 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి $1,978.17 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి $1,990.50కి చేరుకుంది.

ఇతర విలువైన లోహాలలో స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి $23.01కి చేరుకుంది. 

 విశాఖపట్నంలో  కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 250 పెంపుతో రూ. 55,700  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 260 పెంపుతో  రూ. 60,750. వెండి ధర కిలోకు రూ.77,500.

హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 250 పెరుగుదలతో రూ. 55,700  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 260 పెంపుతో రూ. 60,760. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 77,500. 

అయితే, పైన పేర్కొన్న బంగారం రోజువారీ ధరలలో GST, TCS  ఇతర లెవీలు ఉండవు, అంటే ఈ రేట్లు కేవలం సూచిక మాత్రమే. ఖచ్చితమైన ధరల కోసం తప్పనిసరిగా స్థానిక గోల్డ్ షాప్ సంప్రదించాలి.

Latest Videos

click me!