పండగ సీజన్లో పసిడికి మళ్ళీ రెక్కలు.. బంగారంపై ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం.. తులం ఎంత పెరిగిందంటే..?

First Published | Oct 10, 2023, 10:26 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ. 60,000 నుండి  అలాగే  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.55,000 నుండి దిగొచ్చింది.  గత 24 గంటల్లో  24 క్యారెట్లు/ 22 క్యారెట్లు (10 గ్రాములు)  బంగారం ధరలు పెరిగాయి.
 

ఈరోజు ఇండియాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 57,330, అయితే 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 52,520.

 ఢిల్లీలో  24 క్యారెట్ల 10గ్రాముల ధర    రూ.220 పెరిగి రూ.58,350, 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.53,500. 
  వెండి ధర కిలోకు రూ. 72,600.

ముంబైలో  24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.58,200, 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.53,350

చెన్నైలో  24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.56,330, 22 క్యారెట్ల 10గ్రాముల ధర  రూ.53,650

కోల్‌కతాలో  24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.58,200, 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.53,350
 

స్పాట్ గోల్డ్ 0314 GMT నాటికి ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి $1,862.80కి చేరుకుంది,  US గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం పెరిగి $1,876.90కి చేరుకుంది.

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి $21.85 డాలర్లకు, ప్లాటినం 0.3 శాతం పెరిగి 889.11 డాలర్లకు, పల్లాడియం 0.5 శాతం పెరిగి $1,144.82 డాలర్లకు చేరుకుంది.

బెంగళూరులో  24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.58,200, 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.53,500

విశాఖపట్నంలో  24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.58,200, 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.53,350. 


 విజయవాడలో  రేట్ల ప్రకారం చూస్తే, ఈరోజు ధరల ప్రకారం, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200  పెంపుతో రూ. 53,350.    10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెంపుతో రూ. 58,200. వెండి విషయానికొస్తే విజయవాడలో వెండి ధర కిలోకు రూ.75,500.

'క్యారెట్' అనేది ఆభరణాల వస్తువులో బంగారం స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే పదం. 24K బంగారం 99% స్వచ్ఛతతో  ఉంటుంది.

ఈరోజు ధరల ప్రకారం చూస్తే  హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెంపుతో రూ. 53,350 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 220 పెంపుతో రూ. 58,200. వెండి విషయానికొస్తే వెండి ధర రూ. కిలోకు 75,500.

గత వారంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, ప్రస్తుతం ఇంకెంత పెరుగుతుందో చూడాలి.
 

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ఎప్పుడైనా ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనేవారు   లైవ్  ధరలను ట్రాక్ చేయాలి.

పైన పేర్కొన్న బంగారం ధరలలో GST, TCS  ఇతర లెవీలు ఉండవని కొనుగోలుదారులు గమనించాలి; దీని అర్థం ఇవి కేవలం సూచిక మాత్రమే. ఖచ్చితమైన రోజువారీ ధరల కోసం  మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించండి.

Latest Videos

click me!