Gold And Silver Prices Drop: బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. మరి బంగారం, వెండి కొనడానికి ఇదే బెస్ట్ టైమా? నిపుణులు ఏం చెబుతున్నారు? ధరలు మరింత తగ్గుతాయా? పెరుగుతాయా?
భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. ఇప్పుడు కొంటే లాభమా? నష్టమా?
కొంతకాలంగా నిరంతరం పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ధరలకు ఇప్పుడిప్పుడే ఊహించని బ్రేక్ పడుతోంది. పసిడి ప్రియులకు ఇది నిజంగా పెద్ద ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,700తగ్గింది. దీంతో తులం గోల్డ్ ధర రూ.1,44,380కు చేరింది.
దేశవ్యాప్తంగా కూడా సరిగ్గా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న అనూహ్య మార్పులు, ధరల మార్పుల వంటి కారణాల వల్ల బంగారం ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. ఉత్సవాలు, పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనాలని ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది నిజంగా మంచి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
25
బంగారం రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి? వెనుక అసలు కారణమేంటి?
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు నేరుగా బంగారం ధరలను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న గొడవలు, వాణిజ్య రవాణా సమస్యలు, సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై వస్తున్న బెదిరింపుల కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల భవిష్యత్తులో ద్రవ్యోల్బణం అదుపుతప్పుతుందనే భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. మరోవైపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందో అని ప్రపంచ మార్కెట్ అంతా ఉత్కంఠగా చూస్తోంది. ఈ టెన్షన్లన్నీ కలిసి నేరుగా గోల్డ్ మార్కెట్‌ను పడగొట్టాయి.
35
ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి, వెండి భారీ పతనం
మల్టీ కమ్యూనికేషన్ ఎక్స్ఛేంజ్ అంటే ఎంసీఎక్స్‌లో గురువారం బంగారం ధరల్లో భారీ పతనం నమోదైంది. 10 గ్రాముల బంగారం ధర సుమారు 0.42 శాతం తగ్గి 1,45,898 రూపాయల వద్ద ట్రేడైంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధర కూడా దారుణంగా పడిపోయింది. కిలో వెండి ధర 1.16 శాతం తగ్గి ఏకంగా 2,09,028 రూపాయలకు పడిపోయింది. వరుసగా రేట్లు భగ్గుమంటున్నాయని గోల్డ్ షాపింగ్‌ను వాయిదా వేసుకున్న మధ్యతరగతి ప్రజలకు ఈ ధరల తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,700 తగ్గి రూ.1,44,380కు చేరితే, కిలో వెండి ధర మరో రూ.5,000 తగ్గి రూ.2.25 లక్షలకు చేరుకుంది.
కొనడానికి ఇదే కరెక్ట్ టైమా? నిపుణులు ఏం చెబుతున్నారు?
ఇప్పుడు చాలామందిలో ఉన్న పెద్ద డౌట్.. "రేట్లు బాగా తగ్గాయి కదా, ఇప్పుడే బంగారం కొనేయడం మంచిదా?" అనేదే. ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా బంగారం ధరలు రానున్న రోజుల్లో కూడా చిన్నపాటి హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే, దీపావళి, పెళ్లిళ్లు, ధన్‌తేరాస్ వంటి పండుగలు, వేడుకల కోసం బంగారం కొనాలని చూస్తున్న వారికి ప్రస్తుత ఈ ధరల తగ్గుదల ఒక చక్కటి అవకాశం కిందే లెక్క. రేట్లు తగ్గాయని ఒకేసారీ మొత్తం డబ్బులు పెట్టి షాపింగ్ చేసేయడం కంటే, కొంత తెలివిగా అడుగు వేయడం చాలా మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
55
షాపింగ్ చేసే ముందు మర్చిపోకూడని ముఖ్యమైన టిప్స్
బంగారం కొనేటప్పుడు ఆర్థిక నిపుణులు కొన్ని విలువైన సలహాలు ఇస్తున్నారు. ఒకేసారీ పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి గోల్డ్ కొనడానికి బదులు, విడతలవారీగా అంటే దశలవారీగా కొనుగోలు చేయడం చాలా సేఫ్. ఒకవేళ మార్కెట్లో ధరలు మళ్లీ పెరిగినా లేదా తగ్గినా ఈ పద్ధతి వల్ల రిస్క్ చాలావరకు తగ్గుతుంది.
అంతేకాదు, మీరు నగల షాపులకు వెళ్లినప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ రేట్లకు, మనం రిటైల్ జ్యువెల్లరీ షాపుల్లో చూసే రేట్లకు వ్యత్యాసం ఉంటుంది. మీరు కొనే నగలపై అదనంగా మేకింగ్ ఛార్జీలు, 3 శాతం జీఎస్టీ వర్తిస్తాయి. కాబట్టి వీటిని కూడా ముందే బేరీజు వేసుకుని షాపింగ్ ప్లాన్ చేసుకోవడం చాలా ఉత్తమం.