Gold And Silver Price Today: స్థిరంగా బంగారం, వెండి ధ‌ర‌లు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధ‌ర‌లివే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 06, 2022, 07:22 AM ISTUpdated : Apr 06, 2022, 07:23 AM IST

బుధ‌వారం మార్కెట్లలో బంగారం ధరలు మారలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా స్థిరంగా నమోదైంది. బంగారం ధరలు యథాతథంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర రూ.400 తగ్గి రూ.71 వేలుగా నమోదైంది.  

PREV
15
Gold And Silver Price Today: స్థిరంగా బంగారం, వెండి ధ‌ర‌లు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధ‌ర‌లివే..!

బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరలు ఒక రోజు తగ్గుముఖం పడితే.. మరో రోజు పెరుగుతున్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు.

25

అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధ‌వారం (ఏప్రిల్ 6, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

35

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,140గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,160 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,540గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,140 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,140గా ఉంది.

45

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,800 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,800 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,140గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

55

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, ముంబైలో రూ.66,300గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.71,000 ఉండగా, కోల్‌కతాలో రూ.66,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,000 ఉండగా, కేరళలో రూ.71,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,000 ఉండగా, విజయవాడలో రూ.71,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories