ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ డీల్ : జూలై 20న సుప్రీంకోర్టు విచారణ వాయిదా..

First Published Jul 9, 2021, 1:19 PM IST

ఫ్యూచర్‌ రిటైల్‌-రిలయన్స్ ఒప్పందంపై జూలై 20న ఢీల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అమెజాన్ చేసిన పిటిషన్ను విచారించనున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో రూ .24,713 కోట్ల ఆస్తుల అమ్మకపు ఒప్పందాన్ని నిలిపివేసిన ఢీల్లీ హైకోర్టు డివిజన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమెజాన్ ఏప్రిల్ 8న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.     

ఈ విషయంలో ఫ్యూచర్ గ్రూప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, జస్టిస్ ఆర్ఎఫ్ నరిమన్, జస్టిస్ కెఎమ్ జోసెఫ్, బిఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ప్రకారం దీనిపై విచారణ జూలై 12 నుండి సింగపూర్ కోర్టులో జరపనుందని ఈ పరిస్థితుల్లో వారం పాటు కేసు విచారణను వాయిదా వేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
undefined
అమెరికా ఇ-కామర్స్ సంస్థ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం అప్పీల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేయడంతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.తదుపరి విచారణను ధర్మాసనం జూలై 20ను నిర్ణయించింది. విలీనంపై తుది ఉత్తర్వులు జారీ చేయవద్దని ఫిబ్రవరి 22న సుప్రీం కోర్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ను కోరింది.
undefined
అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య న్యాయ వివాదంరిలయన్స్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌ తన రిటైల్‌ అండ్‌ హోల్‌సేల్, లాజిస్టిక్స్‌ బిజినెస్‌ను విక్రయిస్తూ 2020లో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల డీల్‌పై అమెజాన్‌ న్యాయపోరాటం చేస్తోంది. ఫ్యూచర్‌ అన్‌లిస్టెడ్‌ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్‌ కూపన్స్‌ లిమిటెడ్‌లో (బీఎస్‌ఈ లిస్టెడ్‌ ఫ్యూచర్‌ రిటైల్‌లో ఫ్యూచర్స్‌ కూపన్స్‌ లిమిటెడ్‌కు కన్వెర్టబుల్‌ వారెంట్స్‌ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్‌ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్‌ కూపన్స్‌ డీల్‌ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్‌ రిటైల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్‌ పేర్కొంది.
undefined
click me!