ఇదిలావుండగా నేటి పెట్రోల్ డీజిల్ కొత్త ధరలను భారతీయ ఆయిల్ కంపెనీలు విడుదల చేశాయి. మే 2022 తర్వాత ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఇంధన ధరలను కంపెనీలు మార్చలేదు. దేశ రాజధాని ఢిల్లీలో నేటికీ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.76, కాగా, ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24. జూన్ 2017 ముందు, ఇంధన ధర ప్రతి 15 రోజులకు సవరించేవారు. అయితే, ఇప్పుడు ధరలు ప్రతిరోజూ సవరిస్తున్నారు.