నేడు ఇంధన ధరలు ఇలా.. హైదరాబాద్ సహా పలు రాష్ట్రాల్లో లీటరు ఎంతంటే..?

First Published | Dec 20, 2023, 9:50 AM IST

ప్రభుత్వ చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా కొత్త ఇంధన ధరలను నేడు విడుదల చేశాయి. ఈరోజు అంటే డిసెంబర్ 20వ తేదీన పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కాగా పలు రాష్ట్రాల్లో పెరిగాయి.  మీరు ఇంటి నుండి బయలుదేరే ముందు పెట్రోల్   డీజిల్ కొత్త ధరలను చెక్  చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే   ధరలు ఎక్కడ తగ్గాయి ఎక్కడ పెరిగాయి అని తెలుసుకోవడం మీకు ముఖ్యం. దేశంలోని అన్ని మెట్రో నగరాలలో ఇంకా వివిధ రాష్ట్రాలలో పెట్రోల్  డీజిల్ ఈ రోజు ఏ ధరకు లభిస్తుందో తెల్సుకుందాం... 

దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలు, రాజధాని ఢిల్లీ, ముంబై ఇంకా కోల్‌కతాలో ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. చెన్నైలో పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 9 పైసలు స్వల్పంగా తగ్గింది.

ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది.

ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటరుకు రూ.94.27గా ఉంది.

కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది.

చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.74, డీజిల్ ధర లీటరుకు రూ.94.33గా ఉంది.

 వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్   డీజిల్ ధరలు
ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.


ఈ రాష్ట్రాల్లో పెట్రోలు-డీజిల్ ధరలు తగ్గాయి

అస్సాంలో పెట్రోల్ 29 పైసలు తగ్గి రూ.98.33కి, డీజిల్ లీటరుకు 28 పైసలు తగ్గి రూ.90.63కి చేరుకుంది.

బీహార్‌లో లీటర్ పెట్రోల్ 43 పైసలు తగ్గి రూ.109.23కి, డీజిల్ 40 పైసలు తగ్గి రూ.95.88కి చేరుకుంది.

ఛత్తీస్‌గఢ్‌లో లీటరు పెట్రోల్‌పై 5 పైసలు తగ్గి రూ.103.58కి చేరగా, డీజిల్ 4 పైసలు తగ్గి రూ.96.55కి చేరుకుంది.

గుజరాత్‌లో లీటరు పెట్రోల్‌పై 7 పైసలు తగ్గి రూ.96.50కి, డీజిల్‌పై 8 పైసలు తగ్గి రూ.92.24కి చేరుకుంది.

జమ్మూ కాశ్మీర్‌లో లీటరు పెట్రోల్‌పై 26 పైసలు తగ్గి రూ.100.56కి, డీజిల్‌పై 33 పైసలు తగ్గి రూ.85.82కి చేరుకుంది.

జార్ఖండ్‌లో లీటరు పెట్రోల్ 9 పైసలు తగ్గి రూ.100.21కి, డీజిల్ 9 పైసలు తగ్గి రూ.95.00కి చేరుకుంది. 

కేరళలో లీటరు పెట్రోల్‌పై 72 పైసలు తగ్గి రూ.107.86కు చేరుకోగా, డీజిల్ 68 పైసలు తగ్గి రూ.96.77కి చేరుకుంది.

రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్ 35 పైసలు తగ్గి రూ.108.19కి, డీజిల్ 32 పైసలు తగ్గి రూ.93.46కి చేరుకుంది.

తమిళనాడులో లీటరు పెట్రోల్‌పై 3 పైసలు తగ్గి రూ.103.88కి, డీజిల్ 2 పైసలు తగ్గి రూ.95.50కి చేరింది.

తెలంగాణలో లీటరు పెట్రోల్‌ ధర రూ.109.66,  లీటరు డీజిల్ ధర రూ.97.82

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 73.44 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 79.23 డాలర్లకు చేరుకుంది. 

ఏయే రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటే 
 దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఎగిశాయి. మహారాష్ట్రలో పెట్రోల్ ధర 58 పైసలు పెరిగింది. దింతో పెట్రోల్ లీటరు రూ. 106.85కి లభిస్తుంది. డీజిల్ ధర 13 పైసలు పెరిగి లీటరుకు రూ.93.46గా ఉంది.దీంతో పాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఒడిశాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి.  
 

ఇంట్లో కూర్చొని కూడా పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ వినియోగదారులు అయితే, RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపండి, BPCL వినియోగదారులు  RSP అండ్  సిటీ కోడ్‌ని  టైప్ చేసి 9223112222 నంబర్‌కు SMS పంపాలి. దీని తర్వాత మీకు SMS ద్వారా మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది. HPCL వినియోగదారులు HPPrice అండ్  సిటీ కోడ్‌ని టైప్ చేసి  9222201122కు SMS  పంపాలి.

Latest Videos

click me!