బంగారం, వెండి కొంటున్నారా.. ఇవాళ 22, 24 క్యారెట్ల ధరలు ఎంతో చెక్ చేసుకోండి..?

First Published | Dec 19, 2023, 10:24 AM IST

 ఒక నివేదిక ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి పది గ్రాములకి రూ. 62,620 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి 10 గ్రాములకి రూ.57,400కి చేరింది. వెండి ధర రూ. 300 పెరిగి ఒక కిలోకి  విలువైన లోహం రూ. 78,000కు అమ్ముడైంది.

స్వచ్ఛత ఆధారంగా క్యారెట్ 
బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం ధర  99% స్వచ్ఛమైనది. అయితే ఆభరణాల తయారీకి ఉపయోగించబడదు. ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు, ఇది 91% స్వచ్ఛమైనది. 18 క్యారెట్ల బంగారం 75% స్వచ్ఛమైనది, 25% ఇతర లోహాలు కలపబడి ఉంటాయి, ఇది మన్నికైనదిగా చేస్తుంది. 

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు సమానంగా రూ.62,620 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,770, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,620, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,110గా ఉంది.


మంగళవారం 0105 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,027.15 వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ మారకుండా $2,040.90 వద్ద ఉన్నాయి.

మరోవైపు స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి $23.80 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3 శాతం పెరిగి $948.18 డాలర్లకు, పల్లాడియం 0.2 శాతం తగ్గి $1,181.85 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీలో, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000 వద్ద ట్రేడవుతోంది.
 

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌తో సమానంగా రూ.57,400 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.57,450, 

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,400, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850గా ఉంది. 

Latest Videos

click me!