చెక్‌బుక్ నుండి సిలిండర్ వరకు ఈ 10 రూల్స్ నేటి నుండి మారనున్నాయి.. అవేంటో తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : Apr 01, 2021, 02:54 PM IST

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది,  అయితే నేటి నుండి  దేశంలో కొత్తగా 10 నియమాలు మారనున్నాయి. ఈ నియమాల మార్పు మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. 

PREV
111
చెక్‌బుక్ నుండి సిలిండర్ వరకు ఈ 10 రూల్స్ నేటి నుండి మారనున్నాయి.. అవేంటో తెలుసుకోండి..

ఒక వైపు ఈ కొత్త నిబంధనల నుండి మీకు ఉపశమనంతో పాటు మరోవైపు  ఈ కొన్ని విషయాలలో  జాగ్రత్త వహించకపోతే మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి  వస్తుంది. వీటిలో చెక్‌బుక్‌లు, ఎల్‌పిజి సిలిండర్లు మొదలైన వాటికి సంబంధించినవి ఉన్నాయి. ఈ ముఖ్యమైన మార్పుల ఏంటో తెలుసుకుందాం...

211

పాత చెక్‌బుక్ చెల్లదు
బ్యాంక్ కస్టమర్లకు ఇది చాలా ముఖ్యమైన వార్త. ఏప్రిల్ 1 నుండి ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ కోడ్ (ఐఎఫ్ఎస్‌సి), పాత చెక్ బుక్, ఐదు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకు పాస్ బుక్ నేటి నుండి చెల్లవు. అంటే, మీరు మీ పాత చెక్‌బుక్ ద్వారా ఎలాంటి చెల్లింపు చేయలేరు. కాబట్టి మీ అక్కౌంట్ కూడా ఈ బ్యాంకుల్లో ఉంటే మీ పాత చెక్‌బుక్ వెంటనే మార్చండి. ఈ ఐదు బ్యాంకులలో దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఉన్నాయి.

311

దేశీయ ఎల్‌పిజి ధర తగ్గింపు
సామాన్యులకు ఒక విధంగా ఇది శుభవార్త. దేశీయ సిలిండర్ల ధర నేడు తగ్గించారు. సామాన్యులకు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుండి వంట గ్యాస్ ధరలపై ఉపశమనం లభిస్తుంది. దేశీయ ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ .10 తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ బుధవారం తెలిపింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి. చమురు కంపెనీలు ప్రతి నెల ప్రారంభంలో ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. ప్రతి రాష్ట్రానికి పన్ను పన్ను ఆధారంగా ఎల్‌పి‌జి ధరలు తదనుగుణంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రతి సంవత్సరంలో 14.2 కిలోల 12 సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.

411

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా 
మీకు పోస్టాఫీసులో ఖాతా ఉంటే కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుండి డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు అదనంగా ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ (ఎఇపిఎస్) లో ఛార్జీలు చెల్లించాలి. ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత ప్రతి లావాదేవీపై ఛార్జీలు వసూలు చేయబడుతుందని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తెలిపింది.
 
511

ఐటిఆర్ ఫారం
ఉద్యోగుల సౌలభ్యం కోసం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే విధానం సులభతరం చేయబడుతోంది. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందే పూర్తి చేసిన ఐటిఆర్ ఫారమ్‌ను అందిస్తుంది.
 
611

వాటర్ బాటిల్  విక్రయం సులభం కాదు
బాటిల్ లో వాటర్ విక్రయంపై  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కంపెనీల నిబంధనలను మార్చింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ బాటిల్ వాటర్, మినరల్ వాటర్ తయారీదారులకు లైసెన్సులు పొందటానికి లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బి‌ఐ‌ఎస్ ) ధృవీకరణను తప్పనిసరి చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార కమిషనర్లకు పంపిన లేఖలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ సూచన ఇచ్చింది. 

711

డబుల్ టిడిఎస్
ఆదాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పన్ను మినహాయింపు టిడిఎస్ నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పుడు ఆదాయపు పన్ను సెక్షన్ 206 ఎబి కింద దాఖలు చేయని రిటర్న్స్, ఏప్రిల్ 1 తర్వాత డబుల్ టిడిఎస్ చెల్లించాలి.
 
811

ఏప్రిల్ 1 నుండి ఫ్రీలాన్సర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు వంటి జీతం లేని ప్రజలు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అటువంటి వ్యక్తులు వారి ఆదాయాల నుండి 7.5% టిడిఎస్ చెల్లించాలి, కానీ ఇప్పుడు అది 10% కి పెరుగుతుంది.

911

రిటర్న్స్ దాఖలు నుండి మినహాయింపు
ఏప్రిల్ 1 నుండి  75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఐటిఆర్ దాఖలు నుండి మినహాయింపు ఉంటుంది.  

1011

 ఏప్రిల్ 1 నుండి  బిజినెస్-టు-బిజినెస్ (బి-టు-బి) వ్యాపార వార్షిక టర్నోవర్ రూ .50 కోట్లకు పైగా ఉన్న మొత్తం వ్యాపారాలకు ఇ-ఇన్వాయిస్ అవసరం. సుమారు 90 లక్షల మంది వ్యాపారవేత్తలు దీని పరిధిలోకి వస్తారు.

1111
click me!

Recommended Stories