జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువు చాలా అవసరం. చదువే మనకు పెట్టుబడి లాంటిది. అలాంటిది ఓ అబ్బాయి 12th ఫెయిల్ అయ్యాడు. అక్కడితో అతని కథ ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ... ఇప్పుడు బిలీనియర్ గా మారాడు. తాను ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కాదు.. తానే.. వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. కోట్లకు అధిపతిగా కూడా మారాడు. అతను మరెవరో కాదు.. డాక్టర్ మురళీ కృష్ణ ప్రసాద్ దివి. ఇతను మన హైదరాబాదీనే. మరి.. ఈయన కథేంటో తెలుసుకుందామా...
డాక్టర్ మురళీ కృష్ణ ప్రసాద్ దివి.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చదువుల్లో ఆయన యావరేజ్ స్టూడెంట్. 12వ తరగతిలో ఫెయిల్ కూడా అయ్యారు. అయితే.. ఫెయిల్ అయ్యానని ఆయన అక్కడే ఆగిపోలేదు. మరోసారి కష్టపడి చదివి పాస్ అయ్యారు. ఆ తర్వాత బీ.ఫార్మసీలో చేరారు. మొదటి సంవత్సరం నుంచే చాలా కష్టాలు పడ్డారు. కానీ వెనక్కి తిరిగి చూడలేదు. డిగ్రీ పూర్తి చేసి, ఫార్మా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు.
అనుభవం
1975లో వార్నర్ హిందుస్థాన్‌లో ట్రైనీగా దివి తన కెరీర్‌ని ప్రారంభించారు. కానీ ఆయనకు సొంతంగా వ్యాపారం చేయాలనే కోరిక ఉండేది. వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నారు. అమెరికా వెళ్లి గంటకు 7 డాలర్లకు పనిచేశారు. అక్కడ ఆయనకు మార్కెట్ గురించి, ఫార్మా పరిశ్రమ గురించి తెలిసింది.
కెమినార్ డ్రగ్స్
అమెరికాలో ఉండగా, కుటుంబ సమస్య కారణంగా దివి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. 1984లో డాక్టర్ కల్లం అంజిరెడ్డితో కలిసి కెమినార్ డ్రగ్స్‌ను కొనుగోలు చేశారు. ఇది ఆయన కెరీర్‌లో కీలక మలుపు. ఫార్మా రీసెర్చ్, తయారీ గురించి అక్కడ నేర్చుకున్నారు.
जानलेवा कफ सिरप से गांबिया में 66 बच्चों की मौत और WHO के अलर्ट के बाद खाद्य और औषधि प्रशासन विभाग पूरी तरह सक्रिय हो गया है।
దివిస్ రీసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్
1990లో దివిస్ రీసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. ఇతర ఫార్మా కంపెనీలకు సాంకేతిక సలహాలు, సేవలు అందించేవారు. 1994లో నల్గొండలో ఏపీఐ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఇదే దివిస్ లాబొరేటరీస్‌కు పునాది.
వ్యాపార విజయం
డాక్టర్ దివి ఎప్పుడూ నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చేవారు. పేటెంట్లను ఉల్లంఘించలేదు. దీని వల్ల ఆయన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోని టాప్ 10 ఫార్మా కంపెనీలలో 8 కంపెనీలతో దివిస్ లాబొరేటరీస్ భాగస్వామ్యం కలిగి ఉంది. ఈరోజు దివిస్ లాబొరేటరీస్ భారతదేశంలో అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటి.
అక్టోబర్ 2024లో, డాక్టర్ మురళి కృష్ణ ప్రసాద్ దివి, ఆయన కుటుంబం ఫోర్బ్స్ జాబితాలో 29వ స్థానంలో నిలిచారు. 9.2 బిలియన్ డాలర్ల సంపదతో భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. ఆయన ప్రకృతి కథ, ఓటమి నుంచి ఎలా నేర్చుకోవాలో, విజయం సాధించాలో చెబుతుంది.