చిరుధాన్యాలను ఇంగ్లీషులో మిల్లెట్స్ అంటారు. వీటితో చేసినటువంటి స్నాక్స్ విక్రయిస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మంచి రుచిగల స్నాక్స్ చిరుధాన్యాలతో మనం తయారు చేసుకునే వీలుంది. చిరుధాన్యాలతో మన సాంప్రదాయ స్నాక్స్ అయినా మురుకులు, సకినాలు, పకోడీలు, లడ్డూలు, వంటివి చేయవచ్చు. రాగులు, కొర్రలు, సజ్జలను ఉపయోగించి మీరు ఈ స్నాక్స్ తయారు చేయవచ్చు. సాంప్రదాయ రుచులను చిరుధాన్యాలతో అందిస్తే జనం ఆదరణ లభించే అవకాశం సులభంగా తగ్గుతుంది.