ఫ్రీ నెట్‌ఫ్లిక్స్‌.. జియో-ఎయిర్‌టెల్-వోడాఫోన్ ఐడియాలు అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు

First Published | Aug 19, 2024, 3:50 PM IST

free netflix : జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా లు ప్ర‌స్తుతం యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఉచిత ఓటీటీల ప్రీపెయిడ్ ప్లాన్‌లు తీసుకువ‌చ్చాయి. హైస్పీడ్ డేటా, ఉచిత‌ నెట్‌ఫ్లిక్స్‌తో ఉత్తమ ప్రీపెయిడ్ ప్లాన్ల‌లో ఇప్పుడు ఏది మీకు బెస్ట్ అనే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.. !
 

free netflix : మీరు ప్ర‌స్తుతం ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే అలాంటి ప్లాన్ల‌ను అందిస్తున్న ప్ర‌ధాన టెలికాం ఆపరేటర్‌లలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ముందుంటాయి. ప్రీమియం కంటెంట్‌కు పేరుగాంచిన నెట్‌ఫ్లిక్స్ అత్యంత ఖరీదైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ గా ఉంది. ఈ క్ర‌మంలోనే టెలికాం కంపెనీలు యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ అందించే ప్లాన్స్ ను తీసుకువ‌చ్చాయి. ప్రతి ఒక్కటీ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌కు యాక్సెస్‌ను కలిగి ఉండే ఒక ప్లాన్‌ను అందిస్తోంది. దీనిని విడివిడిగా కొనుగోలు చేసినప్పుడు అద‌నంగా ఖర్చవుతుంది. కాబ‌ట్టి టెలికాం కంపెనీల ప్లాన్ల‌తో తీసుకుంటే డ‌బ్బులు కాస్తా ఆదా చేసుకోవ‌చ్చు..  ఆ వివ‌రాలు మీకోసం.. 

ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో రిల‌య‌న్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు రూ. 1,000 కంటే ఎక్కువ ధరతో అందుబాటులో ఉన్నాయ‌. ఒక‌టి రూ. 1,299 ప్లాన్: ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు 2జీబీ రోజువారీ డేటా, మొత్తం 168జీబీ డేటా ఉంటుంది. గతంలో, జూలై 3న టారిఫ్ పెంపునకు ముందు, ఈ ప్లాన్ ధర రూ.1,099గా ఉంది. రెండోది రూ. 1,799 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల పాటు 3జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. మొత్తం 252GB డేటా ఉంటుంది. ధర పెరుగుదలకు ముందు ఇది రూ.1,499కి అందుబాటులో ఉండేది. ఈ రెండు ప్లాన్ల పై మీరు అన్ లిమిటెడ్ 5జీ డేటాను ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎఎస్ఎంఎస్ లు చేసుకోవ‌చ్చు. 


ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వొడాఫోన్ ఐడియా ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. జియో మాదిరిగానే రెండింటి ధర రూ. 1,000 కంటే ఎక్కువగానే ఉంది. కానీ, జియోతో పోలిస్తే కాస్త త‌క్కువ‌గానే ఉంది. అందులో ఒక‌టి రూ. 1,198 ప్లాన్: ఈ ప్లాన్ 70 రోజుల పాటు 2జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది, మొత్తం 140జీబీ డేటా. ఈ ప్లాన్ జియో ఎంట్రీ-లెవల్ ప్లాన్ కంటే రూ. 101 తక్కువ. రెండోది రూ. 1,599 ప్లాన్: ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు 2.5జీబీ రోజువారీ డేటా, మొత్తం 210జీబీ డేటా ఉంటుంది. ఇది జియో రూ. 1,799 ప్లాన్ కంటే రూ. 200 తక్కువ. వొడాఫోన్ ఐడియా రెండు ప్లాన్‌లలో అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందిస్తోంది.

ఉచిత నెట్‌ఫ్లిక్స్‌తో భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉన్న ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను మాత్రమే అందిస్తుంది. అది రూ. 1,798 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల పాటు 3జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. మొత్తం 252జీబీ డేటా ఉంటుంది. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను కూడా అందిస్తుంది. జియో లాగే ఎయిర్ టెల్ కూడా అప‌రిమిత 5జీ డేటాను అందిస్తుంది. 

జియో-ఎయిర్‌టెల్-వోడాఫోన్ ఐడియా.. మీకు ఏ ప్లాన్ బెస్ట్?

ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ను కలిగి ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవడం విషయానికి వస్తే, మీ నిర్ణయం మీ బడ్జెట్, డేటా అవసరాలు, 5జీ సేవలు అందుబాటులో ఉన్న విష‌యాల‌పై ఆధారపడి ఉంటుంది. మీకు 5జీ స‌ర్వీసులు అందుబాటులో ఉంటే జియో, ఎయిర్ టెల్ తో మంచి ప్ర‌యోజ‌నాలు అందుతాయి. వోడాఫోన్ ఐడియా చౌక‌గానే ఉంది కానీ 5జీ డేటా అందించ‌డం లేదు. మీరు ఉండే ప్రాంతంలో 5జీ స‌ర్వీసులు లేక‌పోతే ఇది మీకు మంచి ఎంపిక‌ కావచ్చు. జియో, ఎయిర్ టెట్ 5జీ స‌ర్వీసు పోటీ దారులుగా ఉన్నాయి. మీ ద‌గ్గ‌ర ఏ నెట్ వ‌ర్క్ బెట‌ర్ గా ఉంటే దానిని ఎంచుకోవ‌డం ఉత్త‌మం. 

Latest Videos

click me!