Personal Loan: పర్సనల్ లోన్ త్వరగా తీరిపోవాలంటే ఇలా చేయండి

Published : Feb 08, 2026, 08:57 PM IST

Personal Loan: పర్సనల్ లోన్ త్వరగా వచ్చేస్తుందని ఎక్కువ మంది వాడేస్తూ ఉంటారు. కానీ దానిపూ వడ్డీ సాధారణంగా 10-18 శాతం వరకు ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. పర్సనల్ లోన్ త్వరగా తీరాలంటే ఈ చిట్కాలు పాటించండి 

PREV
14
చిన్న మొత్తాలు దాచి

పర్సనల్ లోన్ తీసుకున్న వారు ప్రతి నెలా ఈఎమ్ఐ కట్టేందుకు సిద్ధపడిపోతారు. కానీ దాన్ని తెలివిగా ముందే క్లోజ్ చేసుకోవాలని మాత్రం అనుకోరు.  పర్సనల్  లోన్ తీసుకున్నాక కొన్ని EMIలు కట్టిన తరువాత పాక్షికంగా ముందస్తు చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చెల్లింపులకు ప్రతి నెలా ఖర్చులు తగ్గించుకుని కొంత దాచుకుని కట్టడం మంచిది. దీని వల్ల ఈఎమ్ఐ చెల్లించాల్సిన నెలలు చాలా వరకు తగ్గుతాయి. లోన్ కాలపరిమితి లేదా EMI తగ్గడం వల్ల మీకు తెలియకుండానే డబ్బు ఆదా అవుతుంది.

24
వడ్డీ రేటును మళ్లీ చెక్ చేయండి

మీ క్రెడిట్ స్కోర్ 750 కి పైగా ఉంటుందా? EMIలు ప్రతి నెలా సరిగ్గానే కట్టేస్తున్నారా?  మీ ఆదాయం కూడా పెరిగిందా? అయితే  మీకు వడ్డీ రేటు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. చిన్న ఫీజుతో బ్యాంకులు వడ్డీ రేటును సవరిస్తాయి. ఒక శాతం వడ్డీ తగ్గినా చాలు వేలల్లో ఆదా అవుతుంది.

34
EMI మిస్ అయితే చాలా నష్టం

ఒక్క EMI ఆలస్యమైనా లేట్ ఫీజు, ప్యానల్ వడ్డీ పడుతుంది. క్రెడిట్ స్కోర్ కూడా పడిపోతుంది. దీని వల్ల  భవిష్యత్తులో లోను దొరకడమే కష్టంగా మారిపోతుంది. EMI కట్టడంలో ఇబ్బంది ఉంటే, ముందుగానే బ్యాంకుతో మాట్లాడండి. బోనస్, ట్యాక్స్ రీఫండ్ లేదా అదనపు ఆదాయం వచ్చినప్పుడు, ఆ డబ్బును లోన్ కట్టేయడం మంచిది. ఇలా చేస్తే లోన్ త్వరగా తీరుతుంది.  మొత్తం వడ్డీలో ఆదా కూడా అవుతుంది. ఇది మంచి నిర్ణయం.

44
లోన్ స్టాకింగ్ వద్దు

ఒక పర్సనల్ లోన్ తీర్చడానికి మరో పర్సనల్ లోన్ తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇది సమస్యకు పరిష్కారం కాదు. వడ్డీ రేటు చాలా తక్కువ ఉండి, అది బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అయితేనే మంచిది. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది.

ప్రతి నెలా EMI కట్టడం మాత్రమే కాకుండా, అసలు మొత్తం ఎంత తగ్గుతుందో గమనించండి. ఇది మీకు స్ఫూర్తినిస్తుంది. బకాయి ఉన్న అసలును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం లోన్ త్వరగా తీర్చడానికి సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories