Flipkart Drone Delivery: ఇకపై ఫ్లిప్ కార్ట్ నుంచి డ్రోన్ డెలివరీ సర్వీసులు ప్రారంభం..ఈ నగరం నుంచే స్టార్ట్

Published : Aug 17, 2022, 12:13 PM IST

ట్రాఫిక్ చిక్కులన్నీ దాటుకొని ఈ కామర్స్ ద్వారా ఆన్ టైం డెలివరీ పొందడం గగనమే. అయితే డ్రోన్ టెక్నాలజీ సహాయంతో నిమిషాల్లోనే తమ కస్టమర్లకు డెలవరీ చేసేందుకు ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి  డ్రోన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్కై ఎయిర్ (Skye Air Mobility), ఫ్లిప్‌కార్ట్ జట్టుకట్టాలని నిర్ణయించుకున్నాయి.

PREV
15
Flipkart Drone Delivery: ఇకపై ఫ్లిప్ కార్ట్ నుంచి డ్రోన్ డెలివరీ సర్వీసులు ప్రారంభం..ఈ నగరం నుంచే స్టార్ట్
Flipkart

Flipkart Internet Pvt Ltd అనుబంధ సంస్థ అయిన Flipkart Healthతో Skye Air Mobilityతో భాగస్వామిగా ఉంది. దీంతో ఫ్లిప్‌కార్ట్ హెల్త్ వారు ఆర్డర్ చేసిన ఉత్పత్తులను డ్రోన్ ద్వారా కస్టమర్లకు డెలివరీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టును పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా కోల్‌కతా సబర్బన్ నగరాలకు త్వరగా మెడిసిన్స్ డెలివరీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
25
Representative Image

ప్రతి రోజు ఐదు కిలోల ఉత్పత్తి లోడ్‌తో 20 డ్రోన్ ల ద్వారా ఈ డెలివరీ సేవలను నిర్వహిస్తున్నారు. డ్రోన్‌లు ఆకాశంలో 16 కిలోమీటర్ల పరిధిలో ఉత్పత్తులను పంపిణీ చేస్తున్నాయి. దీని ట్రయల్ దశ సెప్టెంబర్ 8, 2022 నుండి ప్రారంభం కానుంది. 

35
Representative Image

ఫ్లిప్‌కార్ట్ డ్రోన్‌లు  జియో-మ్యాపింగ్, షిప్‌మెంట్‌ రూటింగ్,  లొకేషన్ ట్రాకింగ్ వంటి టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి.  దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఫ్లిప్‌కార్ట్ ఈ డ్రోన్లను అభివృద్ధి చేసింది.
 

45
Representative Image

మొదటి దశలో ఫ్లిప్ కార్ట్ మెడిసిన్స్ ద్వారా మందులను  డెలివరీ చేయడానికి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలలో బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ డెలివరీ కోసం తన సేవలను ఉపయోగిస్తోంది.

55
Representative Image

Flipkart భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఒకటి.  Flipkart 300 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. కంపెనీ 80+ విభాగాల్లో 150 మిలియన్లకు పైగా ఉత్పత్తులను డెలివరీ ద్వారా అందిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories