Business Ideas: 4 ఎకరాలు పొలంలో ఈ మొక్కలు నాటితే చాలు, రూ. 50 లక్షలు మీ సొంతం అయ్యే అవకాశం ఎలాగంటే..?

Published : Aug 16, 2022, 03:53 PM IST

సంప్రదాయ పంటలకు బదులు రైతులు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. పంటతో పాటు తమ పొలాల్లో చెట్లను నాటుతున్నారు. ఈ రోజు మనం  అటువంటి చెట్టు గురించి తెలుసుకుందాం. మీరు మీ ఇతర పంటలతో నాటడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మలబార్ వేప సాగు గురించి ప్రధాన విషయాలను తెలుసుకుందాం. 

PREV
16
Business Ideas: 4 ఎకరాలు పొలంలో ఈ మొక్కలు నాటితే చాలు, రూ. 50 లక్షలు మీ సొంతం అయ్యే అవకాశం ఎలాగంటే..?

మలబార్ వేపను అనేక పేర్లతో పిలుస్తారు. మెలియాసి బొటానికల్ కుటుంబం నుండి ఉద్భవించిన మలబార్ వేప యూకలిప్టస్(జామాయిల్) లాగా వేగంగా పెరుగుతుంది. నాటిన 2 సంవత్సరాలలోపు ఇది 40 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల రైతులు ఈ చెట్టును అధికంగా సాగు చేస్తున్నారు.

26

మలబార్ వేప మొక్క  ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎక్కువ ఎరువులు, నీరు అవసరం లేదు. ఇది అన్ని రకాల నేలల్లో కనిపిస్తుంది. ఐదు సంవత్సరాలలో, ఈ కలపలు విలువైనవిగా మారతాయి. పొలం గట్లపై కూడా నాటుకోవచ్చు. దీని మొక్క సంవత్సరానికి 8 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి చెదపురుగులు పట్టవు, కాబట్టి, ప్లైవుడ్ పరిశ్రమలలో దీనికి అత్యధిక గిరాకీ ఉంది.
 

36

దీని కలపను ప్యాకింగ్, రూఫింగ్, భవన నిర్మాణ అవసరాలు, వ్యవసాయ పనిముట్లు, పెన్సిళ్లు, అగ్గిపెట్టెలు, సంగీత వాయిద్యాలు, టీ పెట్టెలు సహా అన్ని రకాల ఫర్నిచర్‌లకు ఉపయోగిస్తారు. దీనితో, పూర్తయిన ఫర్నిచర్ ఎప్పుడూ చెదపట్టదు. అందువల్ల, టేబుల్-కుర్చీలు, అల్మరాలు, అవుట్‌పోస్ట్‌లు, బెడ్‌లు, సోఫాలు, ఇతర వస్తువులను జీవితకాలం పాటు దాని చెక్కతో తయారు చేయవచ్చు.

46

మలబార్ వేప సాగుకు సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండే సారవంతమైన ఇసుకతో కూడిన నేల ఉత్తమం. కంకర మిశ్రమ నిస్సార నేలలో దాని పెరుగుదల పేలవమైన వృద్ధి రేటును చూపుతుంది. అదేవిధంగా లేటరైట్ ఎర్ర నేల కూడా మలబార్ వేప సాగుకు చాలా మంచిది. మార్చి-ఏప్రిల్‌లో విత్తనాలను నాటడం ఉత్తమం.

56

4 ఎకరాల వ్యవసాయ భూమిలో  5 వేల మలబార్ వేప మొక్కలను నాటాల్సి ఉంటుంది. చెట్టు కలపను 8 సంవత్సరాల తర్వాత విక్రయించవచ్చు. 5 సంవత్సరాల్లోనే ఈ కలప అందుబాటులోకి వస్తుంది. 

66

చెట్లు ఏపుగా ఎదిగిన తర్వాత కనీసం ఎకరానికి 15 లక్షల వరకు సులభంగా సంపాదించవచ్చు. ఒక చెట్టు ఒకటిన్నర నుండి రెండు టన్నుల బరువు ఉంటుంది. మార్కెట్‌లో కనీసం ఈ 500 రూపాయల క్వింటాలు అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 6 నుంచి 7 వేల విలువైన మొక్క కూడా అమ్మితే రైతులు సులువుగా లక్షల రూపాయలు ఆర్జించవచ్చు.

click me!

Recommended Stories