Flipkart Discount: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేస్తున్నాయి.. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకే

Published : Sep 05, 2025, 07:50 PM IST

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభమవుతోంది.  సెప్టెంబర్ 23 నుండి ఈ సేల్ ప్రారంభం అవుతుంది. Apple iPhone 16, Samsung Galaxy S24 ఇతర ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులు ఉన్నాయి. కాబట్టి అప్పటవరకు ఆగి కొనడం మంచిది.

PREV
14
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025

పండుగ సీజన్ ప్రారంభమైపోతోంది. దీనివల్ల ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 తేదీన ప్రకటించనుంది. ఈ మెగా సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. అయితే, ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందో అధికారికంగా ప్రకటించలేదు. అదే రోజున, అమెజాన్ కూడా తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించనుంది. ఆ రోజే మీరు కొన్ని వస్తువులు కొనడం వల్ల ఎన్నో వస్తువులు తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది.

24
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు

ఈ సేల్‌లో ఫ్లిప్ కార్ట్ ప్లస్, ఫ్లిప్ కార్డు బ్లాక్ సభ్యులందరికీ ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. అంతేకాకుండా, స్టీల్ డీల్స్, పరిమిత సమయం ఆఫర్లు, పండుగ రష్ అవర్స్ వంటి ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీని కోసం ప్రత్యేక మైక్రోసైట్ కూడా ఇప్పటికే ప్రారంభించారు.

34
స్మార్ట్‌ఫోన్‌ల ధర తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో, అనేక ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ముఖ్యంగా Apple iPhone 16, Samsung Galaxy S24, Motorola Edge 60 Pro వంటి మోడల్‌లు ప్రత్యేక తగ్గింపుతో అమ్ముతారు. ఇందులో మొబైల్‌లే కాకుండా OnePlus Buds 3 వంటి ఆడియో ఉత్పత్తులు, 55 అంగుళాల స్మార్ట్ టీవీ, ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషిన్ వంటి గృహోపకరణాలు కూడా తగ్గింపు ధరలకు లభిస్తాయి.

44
10% వరకు తగ్గింపు

కొత్త పరికరాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది చక్కని అవకాశం. అంతేకాకుండా, Axis Bank, ICICI Bankలతో కలిసి పనిచేస్తోంది. ఆ బ్యాంకుల కార్డులను ఉపయోగించినప్పుడు, వినియోగదారులు అదనంగా 10% వరకు తగ్గింపు పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories