మొత్తం బ్యాలెన్స్‌డ్ ఛాసిస్, సింపుల్ గా మూవ్ అయ్యే హ్యాండ్లింగ్ మీరు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి. దీని ధర దేశంలోని వివిధ నగరాల్లో రూ. 59,881 నుంచి రూ. 74,050 మధ్య ఉంది. దీని ఫ్యూయల్ ట్యాంకు 10 లీటర్ కెపాసిటీ ని కలిగి ఉంది. కచ్చితంగా లీటరుకు 70 కి.మీ. మైలేజ్ ఇస్తుందని, కంపెనీ తెలిపింది. కండీషన్డ్ గా మెయిన్ టెయిన్ చేస్తే 80 కి.మీ. వరకు మైలేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. TVS స్టార్ స్పోర్ట్ మీ అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా వివిధ వేరియంట్లలో లభిస్తుంది. మంచి బైక్ కొనాలనుకుంటే స్టార్ స్పోర్ట్ మీకు సరైన బైక్ అవుతుంది.