Business Ideas: మహిళలు కేవలం ఉదయం 3 గంటలు పనిచేస్తే చాలు, నెలకు వేలల్లో ఆదాయం, ఈజీ బిజినెస్ ఐడియా

First Published Aug 30, 2022, 3:10 PM IST

బిజినెస్ ఐడియా: మహిళలు వ్యాపారంలో రాణించాలని ప్రధాని మోదీ పలు మార్లు పిలుపునిచ్చారు. అంతేకాదు మహిళలు తమ ఇంటివద్దే ఉండి కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలు చక్కటి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అలాంటి ఐడియాలు బోలెడు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. 

తాజాగా ప్రతీ ఒక్కరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. గజిబిజి బిజీ లైఫులో ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించాలని ప్రత్యేకమైనచర్యలు తీసుకుంటున్నారు. దాన్నే మనం ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. 
 

ప్రస్తుతం డాక్టర్లు ఆరోగ్యం కోసం అనేక ఫల రసాలను రికమెండ్ చేస్తున్నారు. అలాగే సిరిధాన్యాలతో చేసిన జావను తాగమని చెబుతున్నారు. దీన్నే మనం వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. రాగి జావ, సిరిధాన్యాలతో జావ, క్యారెట్, బీట్ రూట్ జ్యూస్, బత్తాయి, దానిమ్మ జ్యూస్ వంటివి విక్రయించడం ద్వారా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. 
 

ఇందుకోసం మీరు కస్టమర్లను భారీ ఎత్తున ఒకే దగ్గర పొందే చాన్స్ ఉంది. ఉదాహరణకు మీ ఏరియాలో ఏదైనా ఒక జాగింగ్ పార్క్, వాకర్స్ ఎక్కువగా వాకింగ్ చేసే ట్రాక్ ఉంటే దాని సమీపంలోనే మీరు ఒక చిన్న మొబైల్ స్టాల్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం మీరు ఒక టేబుల్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. మీ ఇంటి వద్దే రాగిజావ, సిరిధాన్యాలతో చేసిన జావ, క్యారెట్, బీట్ రూట్ జ్యూస్, బత్తాయి, దానిమ్మ జ్యూస్ వంటివి క్యాన్స్ లో తెచ్చుకొని పెట్టుకోవాలి. అప్పుడు వాకింగ్ కోసం వచ్చిన వారు తమ ఆరోగ్యకరమైన డైట్ లో భాగంగా మీరు విక్రయిస్తున్న జ్యూసులను, జావను తాగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. 
 

ఒక గ్లాసు రాగి జావ ధర రూ. 10 గా నిర్ణయించుకుంటే మీకు చక్కటి లాభం లభిస్తుంది. ఇందుకోసం డిస్పోజబుల్ గ్లాసులు పెట్టుకుంటే సరిపోతుంది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకూ మీరు ఈ వ్యాపారం చేసుకోవచ్చు. వీలైతే సాయంకాలం కూడా జ్యూసులను విక్రయించవచ్చు. అంటే మీరు కేవలం రోజులో 3 గంటల పాటు కష్టపడితే చాలు చక్కటి లాభం పొందవచ్చు. 
 

మీ ఇంటివద్దనే తెల్లవారు జామునే వీటిని ప్రిపేర్ చేసుకొని, మీరు ఎంపిక చేసుకున్న స్పాట్ కు సమయానికి  చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీకు కస్టమర్ల నుంచి ఆదరణ లభిస్తుంది. ఇక ప్రచారం కోసం మీరు తయారు చేసిన పదార్థాల్లోని న్యూట్రీషనల్ గుణాలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవచ్చు. అలాగే డయాబెటిస్, బీపీ వ్యాధులతో బాధపడే వారి కోసం కూడా డైటీషియన్లను సంప్రదించి ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తే మంచి సేల్స్ సాధించవచ్చు. 
 

ఇక ఈ బిజినెస్ కోసం మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. రోజువారీ ఖర్చు మాత్రమే ఉంటుంది. ఇక ఈ బిజినెస్ కోసం మీరు స్థానిక మునిసిపాలిటీ వద్ద పర్మిషన్లు తీసుకోవాలి. అలాగే యూపీఐ చెల్లింపులు స్వీకరిస్తే మంచిది. ఎందుకంటే ఉదయాన్నే డబ్బులు చేతిలో పట్టుకొని ఎవరూ జాగింగుకు రారన్న విషయం గుర్తుంచుకోవాలి. 
 

అలాగే సలాడ్స్, మొలకెత్తిన గింజలు, ఉడకబెట్టిన కోడిగుడ్లను కూడా విక్రయించవచ్చు. తద్వారీ కూడా చక్కటి ఆదాయాన్ని మీరు పొందవచ్చు.   

click me!