ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి.. లేకుంటే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అవుతుంది

First Published | Nov 29, 2024, 7:02 PM IST

fake loan apps : మీ బ్యాంకు ఖాతాను ఖాళీ కాకుండా ఉండాలంటే వెంట‌నే ఈ 15 ఫేక్ లోన్ యాప్స్ డిలీట్ చేయండి. వీటి వ‌ల్ల ఇప్ప‌టికే 80 లక్షల మందికి పైగా యూజర్లు డ‌బ్బులు పోగొట్టుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో మీ వ్యక్తిగత డేటాను దొంగిలించి హ్యాకర్లకు పంపుతున్న నకిలీ లోన్ యాప్ లను సెక్యూరిటీ సంస్థ మెకాఫీ పరిశోధకులు గుర్తించారు.
 

Loan apps

fake loan apps : ఇంటర్నెట్ అంద‌రికీ అందుబాటులోకి రావ‌డంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ఈ క్ర‌మంలోనే లోన్ యాప్ ల‌కు బాగా ప్రాచుర్యం ల‌భించింది. చాలా మంది లోన్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవ‌లు ఉప‌యోగించుకుంటున్నారు. అయితే, లోన్ సంగ‌తి ప‌క్క‌నపెడితే మీ మొత్తం బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే ప్ర‌మాదం ఉంది. 

ఎందుకంటే లోన్ యాప్ ల క్రేజ్ ను అద‌నుగా చేసుకుని కొంద‌రు మోస‌గాళ్లు ఫేక్ లోన్ యాప్ ల‌లో ప్ర‌జ‌ల సోమ్మును కాజేస్తున్నారు. ఫేక్ లోన్ యాప్ ల కార‌ణంగా మోస‌పోతున్న‌వారిలో భార‌తీయుల సంఖ్య పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కాబ‌ట్టి మీ ఫోన్ లో ఇప్పుడు మీరు ఇక్క‌డ తెలుసుకోబోయే ఫేక్ లోన్ యాప్ ఉంటే వెంట‌నే డిలీట్ చేయండి. లేకుండా మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది. 

Fake loan apps alert

ఫేక్ లోన్ యాప్స్ బాధితులు భార‌త్ లోనే ఎక్కువ‌

నకిలీ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడంలో భారత్ మొదటి స్థానంలో ఉందని మెకాఫీ తాజా నివేదిక వెల్లడించింది. గత కొన్ని నెలలుగా చాలా మంది తమకు తెలియకుండానే త్వరితగతిన రుణాలు ఇస్తామని హామీ ఇచ్చే యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఇందులో చాలా వ‌ర‌కు ఫేక్ లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ ఫేక్ లోన్ యాప్స్ మీ వ్యక్తిగత సమాచారం, మీ బ్యాంక్ వివరాలను సేక‌రిస్తున్నాయి. వీటిని ఇత‌రుల‌కు షేర్ చేయ‌డంలో మీ ఖాతా ప్ర‌మాదంలో పడుతుంది. 

Latest Videos


80 ల‌క్ష‌ల మంది ప్ర‌భావిత‌మ‌య్యారు

మెకాఫీ నివేదిక ప్ర‌కారం.. గుగూల్ ప్లే స్టోర్ లో ఇలాంటి మోసాల‌కు పాల్ప‌డుతున్న 15 నకిలీ లోన్ యాప్స్ ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. వీటికి మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. మొత్తం 8 మిలియన్ల వినియోగదారులు వీటి వ‌ల్ల డ‌బ్బులు పోగొట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్నార‌ని కూడా నివేదిక పేర్కొంది. లోన్ యాప్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చరించింది. 

ఈ యాప్స్ ఎందుకు ప్రమాదకరం?

ఈ ఫేక్ లోన్ యాప్స్ ను ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు ప్లేస్టోర్ నుంచి తొల‌గించారు. కానీ, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ వాటిని వారి ఫోన్ల‌లో క‌లిగి ఉన్నారు. ఈ నకిలీ లోన్ యాప్ ల‌ను ఇన్స్టాల్ చేసినప్పుడు మీ కాల్స్, సందేశాలు, కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ వంటి యాక్సెస్ ను అడుగుతాయి. రుణం పొందాలనుకునే చాలా మంది పర్యవసానాలను తెలుసుకోకుండానే ఈ యాక్సెస్ లు ఇచ్చేస్తున్నారు. ఒకసారి యాక్సెస్ చేసుకున్న తర్వాత, ఈ యాప్ లు బ్యాంకింగ్ కు అవసరమైన వన్ టైమ్ పాస్వర్డ్ ల‌తో సహా మీ ఫోన్ లోని మొత్తం డేటాను సులభంగా దొంగిలించగలవు.

online loan apps

ఈ యాప్స్ ను గూగుల్ భద్రతా చర్యల చుట్టూ పనిచేసేలా తెలివిగా రూపొందించబడ్డాయి. అందుకే అవి హానికరమైనవి అయినప్పటికీ ప్లే స్టోర్ లో కనిపిస్తాయి. ఈ యాప్ ల‌ ద్వారా తమ ప్రైవేట్ ఫోటోలను తారుమారు చేసే హ్యాకర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప‌లువురు యూజర్లు నివేదించారు. 

మీ ఫోన్ లో ఈ క్రింది 15 నకిలీ లోన్ యాప్స్ ఉంటే వెంట‌నే డిలీట్ చేయండి. లేకుండా మీ వ్య‌క్తిగ‌త స‌మాచారంతో పాటు మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది.

న‌కిలీ లోన్ యాప్స్ ఇవే..

1. Préstamo Seguro-Rápido, seguro
2. Préstamo Rápido-Credit Easy
3. ได้บาทง่ายๆ-สินเชื่อด่วน
4. RupiahKilat-Dana cair
5. ยืมอย่างมีความสุข – เงินกู้
6. เงินมีความสุข – สินเชื่อด่วน
7. KreditKu-Uang Online
8. Dana Kilat-Pinjaman kecil
9. Cash Loan-Vay tiền
10. RapidFinance
11. PrêtPourVous
12. Huayna Money 
13. IPréstamos: Rápido
14. ConseguirSol-Dinero Rápido
15. ÉcoPrêt Prêt En Ligne

loan app fraud

యూజ‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేసిన గూగుల్

ఆన్లైన్ మోసాలు, సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయని గూగుల్ ఇటీవల యూజర్లను అప్రమత్తం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం అంతకంతకూ విస్తరిస్తున్న కొద్దీ, స్కామర్లు తాము కష్టపడి సంపాదించిన డబ్బు నుండి ప్రజలను మోసగించడం సులభంగా మారిన ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావించింది. ఉచితాలు లేదా పెట్టుబ‌డి అవ‌కాశాలు, ఉద్యోగాల పేరుతో మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ఫలితంగా భారీ మొత్తంలో ఆర్థిక దోపిడీలు జ‌రుగుతున్నాయి.

click me!