EV Cars: తగ్గనున్న ఈవీ కార్ల ధరలు, మరో ఆరునెలల్లో పెట్రోల్ కార్ ధరకే ఈవీ కార్లు

Published : Oct 07, 2025, 04:14 PM IST

ఈవీ కారు (EV cars) కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. రాబోయే 4 నుంచి 6 నెలల్లో దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెట్రోల్ వాహనాలకు సమానంగా తగ్గుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రస్తుతం ఈవీ కార్ల ధరలు అధికంగా ఉన్నాయి.

PREV
13
ఈవీ కార్లు తగ్గుతాయి

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. అందుకే పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీ కార్లు ధరలు అధికంగా ఉంటాయి.  రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఈవీ కార్ల ధరలు తగ్గుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.  పెట్రోల్ కార్లకు సమానంగా ఈవీ కార్ల ధరలు కూడా తగ్గుతాయని ఆయన  చెప్పారు. జీఎస్టీ రేట్లు తగ్గించడం, వాహనాలపై సెస్సును తొలగించడం వల్ల ఇటీవల వాహనాల ధరలు చాలా వరకు తగ్గాయి.

23
ఆటో మొబైల్ పరిశ్రమ విలువ

గడ్కరీ మాట్లాడుతూ  తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.14 లక్షల కోట్లు మాత్రమే ఉందని… ఇప్పుడు అది రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. ప్రపంచంలో ఆటోమొబైల్ పరిశ్రమలలో అమెరికా రూ.78 లక్షల కోట్లతో మొదటి స్థానంలో, చైనా రూ.47 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి.

33
మొక్కజొన్న నుంచి ఇథనాల్

భవిష్యత్తులో ఇథనాల్ వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ కలిపి కార్లను నడిపించే పరిస్థితి వస్తుంది. ఇందుకోసం మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా రూ.45,000 కోట్లు సంపాదించారని గడ్కరీ చెప్పారు. 2027 నాటికి దేశంలోని అన్ని ఘన వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో వాడే ప్రాజెక్టును కూడా ప్రారంభించామని ఆయన చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories