కార్ కవర్ ఉపయోగించండి
కారు బయట పార్క్ చేసినప్పుడు దుమ్ము, ధూళి పడి డర్టీగా తయారవుతుంది కదా. నీడగా ఉంటుంది కదా అని మీరు ఏ చెట్టు కిందో పార్క్ చేస్తే మరింత అధ్వానంగా మారిపోతుంది. వర్షం కురిసినప్పుడు ఆ దుమ్మంతా కారు బానెట్, అడుగు భాగంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే కారును కప్పుతూ కవర్ వాడటం మంచిది. ఇది కేవలం ఎండ, వర్షం నుంచే కాకుండా దుమ్ము, ధూళి, చెట్ల నుంచి రాలే ఆకుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.
టైర్లు చెక్ చేయండి
వర్షాకాలంలో టైర్లలో గాలి సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే టైర్లలో సరైన ప్రెషర్ లేకపోతే గ్రిప్ సరిగా ఉండదు. అందువల్ల రోడ్డుపై కారు జారిపోయే ప్రమాదం ఉంటుంది. బురదలో కూడా గ్రిప్ ఉండాలంటే టైర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. కారు స్లిప్పింగ్ నుంచి కాపాడేందుకు ఇది ముఖ్యమైంది.