ఈ బిజినెస్ చేస్తే డబ్బు, ఆరోగ్యం రెండూ మీ సొంతం

First Published | Sep 12, 2024, 12:29 PM IST

మీకు డబ్బు కావాలా? ఆరోగ్యం కావాలా? అంటే ప్రస్తుత కాలంలో చెప్పడం కష్టమైన పనే. ఎందుకంటే డబ్బు సంపాదించే క్రమంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా కష్టం. మరి డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ బిజినెస్ గురించి మీరు తెలుసుకుంటే కచ్చితంగా మీరున్న ప్లేస్ లో ప్రారంభిస్తారు. ఆ వ్యాపారం గురించి ఇక్కడ పూర్తి వివరాలు ఉన్నాయి.

మీరు సొంతంగా బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నారా? మీరున్న ప్రాంతంలోనే జిమ్ ఏర్పాటు చేస్తే అందరికీ ఆరోగ్యం ఇవ్వడంతో పాటు మీరు కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే సాధారణంగా జిమ్ కు వచ్చి ఎక్సర్ సైజులు చేసే టైమ్ లేదని చాలా మంది చెప్పొచ్చు. జిమ్ అంటే కేవలం కండలు పెంచడానికే అన్న అపోహ కూడా చాలా మందిలో ఉంది. వీటన్నింటినీ అధిగమించి మీరు జిమ్ ఏర్పాటు చేస్తే డబ్బుకు డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు. 
 

జిమ్ పెట్టాలనుకుంటే ముందు ఇవి తెలుసుకోవాలి

జిమ్ ఏర్పాటు చేసే సెంటర్ చాలా ముఖ్యం..
టౌన్, సిటీస్ లో జిమ్ పెట్టేందుకు ముందు మీరు మంచి సెంటర్ ను ఎంచుకోవాలి. మీరు ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ జనాలు తిరిగే రద్దీ ప్లేస్ లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే సిటీల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. వారు రావడానికి వెళ్లడానికి వీలుగా ఉండేలా సెంటర్ లో జిమ్ పాయింట్ ఏర్పాటు చేయాలి. 

రోడ్డు సౌకర్యం బాగుంటే కస్టమర్లు సులువుగా చేరగలుగుతారు. కల్చరల్ సెంటర్స్, రెసిడెన్షియల్ ఏరియాస్, కమర్షియల్ హబ్ సమీపంలో అయితే మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. 

పల్లెల్లో అయితే ఎక్కడ ఏర్పాటు చేసినా పర్వాలేదు. కాని జిమ్ ఏర్పాటు చేశామన్న విషయం అందరికీ తెలిసేలా ప్రచారం చేయడం చాలా అవసరం. దీంతో పాటు వాటర్ సప్లై బాగుండేలా చూడాలి. జిమ్ లో కసరత్తులు చేసి అలసిపోయిన వారికి వెంటనే ఫ్రెషప్ అయ్యే విధంగా  వాటర్ ఫెసిలిటీ ఉండాలి. తాగేందుకు మంచి నీటిని  అందుబాటులో ఉంచాలి. 
 


పెట్టుబడి..
సాధారణంగా జిమ్ పెట్టుబడి రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు ఉంటుంది. ఎక్విప్‌మెంట్, ఇంటీరియర్స్, సౌకర్యాలు, మార్కెటింగ్ ఖర్చులు ఇందులో ఉంటాయి.

చిన్న జిమ్‌లకు సరిపోయే బేసిక్ ఫిట్నెస్ ఎక్విప్‌మెంట్ రూ. 2 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఖర్చవుతుంది. పెద్ద స్థాయి జిమ్‌కి పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది.

ఎక్విప్ మెంట్ ఎక్కడ దొరుకుతుంది..
ఫిట్నెస్ ఎక్విప్‌మెంట్ డీలర్లు పరికరాలను సరఫరా చేస్తారు. వీరిని డైరెక్ట్ గా సంప్రదిస్తే మంచి డిస్కౌంట్లు పొందవచ్చు. Nautilus, Body-Solid, Life Fitness, Fitline వంటి ఫేమస్  కంపెనీలు రిప్యూట్ డీలర్ల ద్వారా పరికరాలు అందిస్తాయి. 

మీరు హై ఎండ్ పరికరాల కోసం వెతుకుతున్నట్లయితే అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాల నుండి దిగుమతి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్ పెట్టదలచుకుంటే OLX, Quikr వంటి వెబ్‌సైట్ల ద్వారా సెకండ్ హ్యాండ్ పరికరాలు తక్కువ ధరలో దొరుకుతాయి.

ఆన్ లైన్ స్టోర్స్ అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, డెకాథ్లాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా వివిధ రకాల జిమ్ పరికరాలు కొనుగోలు చేయవచ్చు. FitnessMart, Pro Bodyline, Fitness World వంటి కొన్ని ప్రత్యేకమైన వెబ్‌సైట్స్ కూడా ఫిట్నెస్ పరికరాలు అందిస్తాయి.

ఆదాయ వ్యయాలు..
ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కానీ మీ జిమ్ కు పేరు వచ్చాకా ఆదాయం పెరుగుతుంది. సిటీస్ లో అయితే మీరు జిమ్ ఏర్పాటు చేసిన సెంటర్ ను బట్టి నెలకు రూ. 1000 నుంచి ఫీజు వసూలు చేయవచ్చు. పల్లెల్లో అయితే తక్కువలో తక్కువ రూ.500 నుంచి ఫీజు వసూలు చేయవచ్చు. ఇక మీకు వచ్చే కస్టమర్లపై ఆధారపడి మీ లాభాలనేవి ఉంటాయి. ఎంతమంది కస్టమర్లను మీరు చేర్చుకోగలిగితే మీకు అంత లాభం వస్తుంది. 

మార్కెటింగ్..
మీ ఫిట్ నెస్ సెంటర్ కు ప్రచారం చాలా అవసరం. టౌన్లో అయినా, పల్లెల్లో అయినా ఎంత అడ్వర్టైజ్ చేయగలిగితే మీకు అంత లాభాలు త్వరగా వస్తాయి. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన వారు మంచి ఫిట్‌నెస్ ట్రైనర్లను నియమించుకొని ట్రైనింగ్ షెడ్యూల్ పాటించేలా చేస్తే ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు.  ఎఫెక్టివ్ సోషల్ మీడియా ప్రమోషన్ వల్ల మంచి ఆదాయం పొందవచ్చు. ఆన్‌లైన్ ద్వారా, గ్రూప్ బుకింగ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించడం మంచిది.

లైసెన్స్, అనుమతులు..
జిమ్ ప్రారంభించడానికి స్థానిక అధికారుల నుండి అనుమతులు, లైసెన్సులు తీసుకోవాలి. పంచాయతీ అయితే పంచాయతీ సిబ్బందిని సంప్రదించాలి. మున్సిపాలిటీ, కార్పొరేషన్లు అయితే ఆ కార్యాలయాలకు వెళ్లి వివరాలు తెలిసి ఉన్నతాధికారుల పర్మీషన్ తీసుకోవాలి. 
 

Latest Videos

click me!