పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో వడ్డీ వేస్తున్న కేంద్రం.. బ్యాలెన్స్‌ ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు

First Published | Nov 11, 2023, 9:59 AM IST

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీని EPF ఖాతాలకు జమ చేయడం ప్రారంభించింది. ఈ వడ్డీ కేటాయింపు కారణంగా పిఎఫ్ ఖాతాదారులు వారి  మొత్తం PF బ్యాలెన్స్‌లలో పెరుగుదలను ఆశించవచ్చు. PF ఖాతాలకు వడ్డీ క్రెడిట్ గురించి X (గతంలో Twitter)లో రేగులటరీ  సంస్థ  “ఈ ప్రక్రియ ప్రాసెస్ లో ఉంది, అతి త్వరలో   చూడవచ్చు. వడ్డీ జమ అయినప్పుడు మొత్తం చెల్లించబడుతుంది. వడ్డీ నష్టం ఉండదు ఓపిక పట్టండి." అని పేర్కొంది.

మీ ఉద్యోగి భవిష్య నిధి (EPF) బ్యాలెన్స్ తెలుసుకోవడం మీ రిటైర్మెంట్  సేవింగ్స్ ట్రాక్ చేయడానికి కీలకం. EPFO డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రక్రియను సౌకర్యవంతంగా చేసింది. మీరు మీ EPF బ్యాలెన్స్‌ని వివిధ పద్ధతుల ద్వారా చెక్ చేయవచ్చు. EPFO పోర్టల్, UMANG మొబైల్ యాప్ లేదా SMS సేవలు. ఈ ప్రక్రియలను ఎలా చేయాలో  ఒక సాధారణ గైడ్ కూడా ఉంది.
 

EPFO పోర్టల్ ద్వారా 

మొదట www.epfindia.gov.in లో EPFO ​​పోర్టల్‌ని ఓపెన్ చేయండి. "మై సర్వీసెస్" ట్యాబ్ కింద, ఇ-పాస్‌బుక్ అప్షన్  క్లిక్ చేయండి. ఇప్పుడు మిమ్మల్ని కొత్త పేజీకి మళ్లిస్తుంది, ఇక్కడ మీరు లాగిన్ చేయడానికి మీ యూజర్ నేమ్ (UAN), పాస్‌వర్డ్ ఇంకా క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, 'వ్యూ పాస్‌బుక్‌'పై క్లిక్ చేసి, బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి  ఎంప్లాయర్  సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ EPF బ్యాలెన్స్ స్క్రీన్‌పై చూపిస్తుంది.
 


 UMANG యాప్ 
UMANG యాప్ వివిధ ప్రభుత్వ సేవలకు ఆక్సెస్  అందిస్తుంది. EPF కోసం Google Play Store లేదా Apple App Store నుండి UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోని, మీ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి రిజిస్టర్ చేసుకోండి, తరువాత, "ఆల్ సర్వీసెస్" ట్యాబ్ కింద, 'EPFO'ని సెలెక్ట్ చేసుకోండి. 'ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్' క్లిక్ చేసి, ఆపై 'వ్యూ పాస్‌బుక్‌'. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన మీ UAN అండ్  OTPని ఎంటర్ చేయండి. లాగిన్ అయిన తర్వాత, మీరు మీ EPF బ్యాలెన్స్‌ చూడవచ్చు.
 

SMS ద్వారా

ఈ సర్వీస్ కోసం, మీ UAN నంబర్ తప్పనిసరిగా మీ KYC వివరాలకు (ఆధార్ లేదా పాన్) లింక్ చేయబడాలి. ఈ  సెటప్ చేయబడితే, మీరు "EPFOHO UAN ENG" ఫార్మాట్‌లో 7738299899కి SMS పంపడం ద్వారా మీ EPF బ్యాలెన్స్‌ని చెక్  చేయవచ్చు. 'ENG' అనేది ఇంగ్లీష్ లో మెసేజ్  పొందడానికి. మీరు 'ENG'ని మీకు నచ్చిన భాషలోని మొదటి మూడు అక్షరాలతో రీప్లేస్ చేయవచ్చు.

 మీ EPF బ్యాలెన్స్‌ను చూసుకోవడం  అనేది కేవలం సౌలభ్యం కోసం మాత్రమే కాదు, మీ సేవింగ్స్   ఖచ్చితమైన అంచనాను  అందిస్తుంది. మీ EPF ఖాతా అనేది రిటైర్మెంట్  తర్వాత మీ ఆర్థిక భద్రతా కోసం, కాబట్టి దానిని నిర్వహించడం,  స్టేటస్ పై నిఘా ఉంచడం చాలా ముఖ్యం. EPFO పోర్టల్, SMS, మిస్డ్ కాల్ సర్వీస్ లేదా UMANG యాప్ ద్వారా అయినా, మీ EPF బ్యాలెన్స్‌ని క్రమం తప్పకుండా చెక్  చేయడం ఆర్థిక ప్రణాళికను అందిస్తుంది.  

Latest Videos

click me!