దీపావళి 2023 హాలిడేస్ : ఈ రోజుల్లో బ్యాంకులు బంద్; వివరాలను చెక్ చేసుకోండి..

First Published | Nov 10, 2023, 1:18 PM IST

దేశంలో దీపావళి వేడుకల సందర్భంగా  కొన్ని రాష్ట్రాల్లో ధన్‌తేరాస్ నుండి మొదలై నవంబర్ 15న భాయ్ దోజ్ వరకు భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ సంవత్సరం దీపావళి నవంబర్ 12 ఆదివారం నాడు వస్తుంది దింతో  పండుగ వేడుకలు కూడా ప్రారంభమవుతాయి. 

మరోవైపు ధన్‌తేరాస్ శుక్రవారం అంటే ఈ రోజు నవంబర్ 10న జరుపుకోనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, భారతదేశం అంతటా బ్యాంకులు ఆరు రోజుల వరకు పని చేయవు (ఈ సెలవుల్లో ఆదివారం ఇంకా రెండవ శనివారం కూడా ఉన్నాయి).

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవులను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తుంది, వీటిలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవులు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవులు అండ్ రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే అలాగే  బ్యాంకుల అకౌంట్స్  క్లోసింగ్ ఉన్నాయి.

నవంబర్ నెలలో  ఉన్న పండుగల నేపథ్యంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులు 15 రోజుల వరకు మూసివేయబడతాయి. అయితే UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు ఈ కాలంలో యాక్టీవ్ గా ఉంటాయి.

దీపావళి బ్యాంకు హాలిడేస్  2023:

నవంబర్ 10 (శుక్రవారం): మేఘాలయలో వంగల పండుగ(Wangala Festival) సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 11 (శనివారం): రెండో శనివారం కాబట్టి బ్యాంకులు మూసివేయబడతాయి

నవంబర్ 12 (ఆదివారం): ఆదివారం కావడంతో  బ్యాంకులు మూతపడతాయి
 

Latest Videos


నవంబర్ 13 (సోమవారం): త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇంకా మహారాష్ట్రలో గోవర్ధన్ పూజ/లక్ష్మీ పూజ (దీపావళి)/దీపావళి సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 14 (మంగళవారం)- గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కింలో దీపావళి (బలి ప్రతిపద)/దీపావళి/విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే/లక్ష్మీ పూజ కారణంగా బ్యాంకులు మూసివేయబడుతుంది.

నవంబర్ 15 (బుధవారం) భైదూజ్/చిత్రగుప్త్ జయంతి/లక్ష్మీ పూజ (దీపావళి)/నింగోల్ చకౌబా/భ్రాత్రిద్వితీయ సందర్భంగా సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
 

నవంబర్ 2023లో ఇతర బ్యాంకు సెలవుల లిస్ట్:

నవంబర్ 20 (సోమవారం): బీహార్, రాజస్థాన్‌లలో ఛత్ (Morning Arghya) వేడుకల మధ్య బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 23 (మంగళవారం): ఉత్తరాఖండ్, సిక్కింలోని సెంగ్ కుత్స్నెమ్/ఎగాస్-బగ్వాల్ దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 27 (సోమవారం): మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, హైదరాబాద్ - తెలంగాణ, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, బెంగాల్‌లో గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/రహస్ పూర్ణిమ వేడుకల మధ్య బ్యాంకులు  మూసివేయబడుతుంది. 

నవంబర్ 30 (గురువారం): కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు మూతపడతాయి.

click me!