ఈ‌పి‌ఎఫ్‌ఓ కొత్త రూల్స్: డబ్బు కావాలా..? అయితే పిఎఫ్ ఖాతా నుండి డబ్బు ఎలా తీసుకోవాలో తెలుసుకోండి

First Published Jul 9, 2021, 7:38 PM IST

 కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి  దేశ ప్రజల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసింది. కరోనా నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం లోన్ మారటోరియం వంటి కొన్ని ప్రయోజనాలను కూడా  అందించింది. అయితే ముఖ్యంగా కరోనా చికిత్స ఖర్చు గురించి ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. 

ఇలాంటి పరిస్థితిలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) చందాదారులకు ఒక కొత్త ఉపశమనం ఇచ్చింది. ఆర్దిక సంక్షోభం ఉన్న సమయంలో మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే భయపడడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుండి రూ .1 లక్ష వరకు ముందుగానే ఉపసంహరించుకోవచ్చు. ఎలాంటి అత్యవసర వైద్య సమయంలో ఈ డబ్బును ఉపసంహరించుకోవచ్చు.
undefined
జూన్ 1న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) దీనిపై ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే మీరు కరోనా వైరస్ వల్ల కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరితే ట్రీట్మెంట్ కోసం కూడా మీ పిఎఫ్ నుండి డబ్బు తీసుకోవచ్చు. రోగి లేదా ఆసుపత్రి వివరాలతో పాటు ఉద్యోగి లేదా అతని కుటుంబ సభ్యులెవరైనా ముందస్తుగా పి‌ఎఫ్ డబ్బు కోసం ఒక లేఖను మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో పేర్కొంది.
undefined
మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఇపిఎఫ్ నుండి డబ్బును ఉపసంహరించుకునే సదుపాయం గతంలో కూడా అందించింది. కానీ మీరు మెడికల్ బిల్లు సబ్మిట్ చేసిన తర్వాత ఈ డబ్బును పొందేవారు. కానీ ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్ సర్వీస్ మారింది. దీంతో మీకు మెడికల్ బిల్లు లేకుండా ముందుగానే డబ్బు వస్తుంది. దీని కోసం మీరు ఒక దరఖాస్తు చేసుకోవాలి అలాగే డబ్బు మీ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. కేవలం కొన్ని గంటల్లోనే మీకు లక్ష రూపాయలు లభిస్తాయి.
undefined
ఏ విధంగా డబ్బు ఉపసంహరించుకోవచ్చాంటే..1.ఈ సదుపాయాన్ని పొందడానికి మీరు మొదట www.epfindia.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి .2. ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ లోకి వెళ్లండి.3. క్లెయిమ్ ఫార్మ్ (ఫారం -31,19,10 సి ఇంకా 10డి) ఫిల్ చేయండి.4. ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతా చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేసి వెరిఫి చేయండి.5. ఇప్పుడు 'ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్' పై క్లిక్ చేయండి.6. డ్రాప్ డౌన్ నుండి పిఎఫ్ అడ్వాన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండీ (ఫారం 31).7. ఇక్కడ మీరు డబ్బు ఉపసంహరించుకునే కారణాన్ని ఎంటర్ చేయాలి.8. ఇప్పుడు అవసరమైన మొత్తాన్ని ఎంటర్ చేసి చెక్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేసి మీ చిరునామాను ఎంటర్ చేయండి.9. ఇక్కడ గెట్ ఆధార్ ఓ‌టి‌పి పై క్లిక్ చేసి ఆధార్ లింక్డ్ మొబైల్‌కి వచ్చిన ఓ‌టి‌పిని ఎంటర్ చేయండి.10. ఇప్పుడు మీ క్లెయిమ్ దాఖలవుతుంది.
undefined
click me!