ఉద్యోగులకు నిద్ర లేకుండా...ఇంటికి వెళ్లకుండా ట్విట్టర్ హెడ్‌ఆఫీసులోనే నిద్రపోతున్న ఎలాన్ మస్క్...

First Published Nov 15, 2022, 8:40 PM IST

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ ఆ కంపెనీ CEO పరాగ్ అగర్వాల్‌తో సహా దాదాపు సగం మంది ట్విట్టర్ ఉద్యోగులను ఎలాన్ మస్క్ తొలగించారు. ఇప్పుడు కంపెనీ పని తీరు మార్చేందుకు ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ లోనే మస్క్ నిద్రపోతున్నట్లు ట్వీట్ చేశాడు. 

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సోమవారం ఆయన ఒక ట్వీట్‌లో ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్  ప్రధాన కార్యాలయంలో నిద్రపోతున్నట్లు  చెప్పారు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి, ఆ కంపెనీని సెట్ చేసే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆయన రేయింబవళ్లు కష్టపడుతూ, ఉద్యోగులను సైతం కష్టపెడుతున్నారు.

మీడియా నివేదికల ప్రకారం, ట్విట్టర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, ఎలోన్ మస్క్ కంపెనీ కొత్త రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఇందుకోసం భారీ మార్పులపై కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈ మొత్తం ప్రక్రియలో ఆయన ప్రతిపాదించిన కొన్ని మార్పులు విమర్శలకు గురవుతున్నాయి.

వీటన్నింటి మధ్య, చాలా మంది ట్విట్టర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోతాయనే భయంతో రాత్రిపూట ఆఫీసులోనే నిద్రపోతున్నారని అనేక మీడియా నివేదికలలో కూడా పేర్కొన్నారు. ఈ వార్తల తర్వాత, ఇప్పుడు మస్క్ కూడా తాను ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో నిద్రిస్తున్నానని స్పష్టం చేశాడు. ట్విట్టర్‌లో ప్రతిదీ పరిష్కరించబడే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అయితే ఆ తర్వాత ఆయన ఈ ట్వీట్‌ను తొలగించగా, ప్రస్తుతం ఈ ట్వీట్ కుచెందిన స్క్రీన్ షాట్ తెగ వైరల్ అవుతోంది. 
 

twitter

ఎలాన్ మస్క్ ట్విట్టర్ బాస్ అయినప్పటి నుంచి ఉద్యోగులకు నిద్ర లేకుండా పోయింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, ఎలోన్ మస్క్ ట్విట్టర్ , అప్పటి CEO పరాగ్ అగర్వాల్‌తో సహా దాదాపు సగం మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించారు. కంపెనీలో మిగిలిన ఉద్యోగులకు కొత్త పని టార్గెట్స్ ఇచ్చారు. ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, అనేక సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, ఇందులో చాలా మంది ఉద్యోగులు కార్యాలయంలో నిద్రపోతున్నట్లు కనిపించారు. ఈ ఫోటోలు ట్విట్టర్ కార్యాలయానికి సంబంధించినవి అయినప్పటికీ, దీనికి సంబంధించిన సమాచారంపై స్పష్టత లేదు.

ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, మస్క్ సంస్థను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యల వల్ల తన స్వంత పని కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఇంతలో, కంపెనీ కార్మికులు కూడా వారానికి 80 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అతను ప్రతిరోజూ 16 గంటలు పని చేయవలసి ఉంటుందని. దీనితో పాటు, మస్క్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ను తొలగించాడు. 
 

click me!