ఆధునిక ఫీచర్లుతో రెండు స్కూటర్లు..
అప్టేడ్ అయిన డియో 125 స్కూటర్ లో 4.2 అంగుళాల TFT డిస్ప్లే ఉంది. ఇది మైలేజ్ రీడౌట్, ట్రిప్ మీటర్, పర్యావరణ సూచిక, రేంజ్ డేటా వంటి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంది. స్కూటర్ నడిపే వారికి ఈ ఫీచర్ చాలా బాగా నచ్చుతుంది.
హోండా రోడ్‌సింక్ యాప్ ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా కాల్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్ కూడా పొందవచ్చు. ఈ స్కూటర్లో స్మార్ట్ కీ సిస్టమ్, USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌లు కూడా ఉన్నాయి.