కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. కుటుంబ అవసరాల కోసం కారు ఇప్పుడు అత్యవసర వస్తువు అయిపోయింది. ప్రయాణ సమయంలో సౌకర్యంతో పాటు, టైం కలిసి రావాలని కారు లేని వారు అద్దెకు కారు తీసుకొని ప్రయాణాలు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా నేర్పిన పాఠం ఎవరూ మర్చిపోలేరు. ఆ సమయంలో కారు ఎంత అవసరమో అందరికీ అర్థమైంది. అందుకే కరోనా తర్వాత కార్లు కొనేవాళ్ళు ఎక్కువయ్యారు. కార్ల కంపెనీలు కూడా తక్కువ ధర కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వాటిల్లో కొన్ని బెస్ట్ బడ్జెట్ కార్ల గురించి తెలుసుకుందాం.
హ్యుండై గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుండై గ్రాండ్ ఐ10 నియోస్ తక్కువ ధరలో దొరికే మంచి కారు. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.5.84 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో చాలా సెక్యూర్ గా, సేఫ్టీగా ఉంటుంది ఈ కారు. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ తో ఈ కారు పనిచేస్తుంది. CNG ఆప్షన్ కూడా ఇందులో ఉంది.
గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్ మరియు ఆస్టాతో సహా నాలుగు వేరియంట్స్ లో లభిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా పంచ్, రెనాల్ట్ క్విడ్, సిట్రోయెన్ C3 లకు పోటీగా ఉంది.
టాటా పంచ్
టాటా పంచ్ కూడా తక్కువ ధరలో దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ వేరియంట్ ధర రూ.5.99 లక్షలు. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్స్‌లో వస్తుంది. CNG ఆప్షన్ కూడా ఉంది.
పంచ్ నాలుగు వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి ప్యూర్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ క్రియేటివ్ మోడల్స్. పంచ్ ఇప్పుడు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ తో పాటు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌తో వస్తోంది. ఇది ఆటోమేటిక్ హెడ్‌లైట్‌లు, వెనుక వెంట్‌లతో కూడిన ఆటో AC, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. టాటా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కోసం 20.09 kmpl ఇస్తుంది. AMT ట్రాన్స్‌మిషన్ కోసం 18.8 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
హ్యుండై ఎక్స్‌టర్
ధర కాస్త ఎక్కువైనా మినీ SUVలా ఉండే హ్యుండై ఎక్స్‌టర్ మీకు, మీ కుటుంబ ప్రయాణానికి మంచి ఆప్షన్. దీని ఎక్స్షో రూమ్ ధర రూ.6.12 లక్షల నుండి మొదలవుతుంది. 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్స్‌లో వస్తుంది. CNG ఆప్షన్ కూడా ఉంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ ఏడు వేర్వేరు వేరియంట్‌లలో వస్తుంది. అదనంగా హ్యుందాయ్ ఇటీవల ఎక్స్టర్‌లో స్ప్లిట్ సిలిండర్ CNG సెటప్‌ను పరిచయం చేసింది. ఇది S, SX, SX నైట్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.
LED DRLలు, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటో AC వంటి కొన్ని హైలైట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సన్‌రూఫ్, డ్యుయల్ కెమెరాలతో కూడిన డాష్ క్యామ్ కూడా ఉన్నాయి.
టాటా టియాగో
టాటా టియాగో మంచి ఫీచర్స్‌తో పాటు సేఫ్టీ కూడా బాగుంటుంది. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్, AMT వేరియంట్స్‌లో వస్తుంది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.5.59 లక్షలు.
టియాగోలో 5 వేరియంట్స్ ఉన్నాయి. XE, XM, XT (O), XT, XZ+ మోడల్స్ ఉన్నాయి. టాటా టియాగో న్యూ గ్రిల్, రీవర్క్డ్ ఫ్రంట్ బంపర్, న్యూ ఎయిర్ డ్యామ్, బ్లాక్ ఓఅర్ విఎంఎస్, 15-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్స్ ఉన్నాయి. టాటా టియాగో లోపలి భాగంలో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్
తక్కువ ధరలో దొరికే మరో మంచి కారు మారుతి సుజుకి వ్యాగన్ఆర్. ఇది 1.0 లీటర్, 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్స్‌లో వస్తుంది. దీని ప్రారంభ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.55 లక్షలు. CNG వేరియంట్ కూడా ఉంది.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి LXi, VXi, ZXi, ZXI+. దీనికి పోటీగా టాటా టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఉన్నాయి.