Business Idea: ఇంట్లో కూర్చుని నెలకు లక్షల్లో సంపాదించాలనుకునేవారికి ఏటీఎం బిజినెస్ ఒక అద్భుతమైన అవకాశం. కేవలం రూ. 5 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.? ఆ వివరాలు ఇలా..
ప్రస్తుత కాలంలో అదనపు ఆదాయం కోసం చూస్తున్నవారికి ఏటీఎం ఫ్రాంచైజీ ఒక మంచి వ్యాపార మార్గంగా మారింది. బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు థర్డ్ పార్టీ సంస్థలకు అనుమతులు ఇస్తున్నాయి. దీని ద్వారా సామాన్యులు కూడా ఏటీఎంలను ఏర్పాటు చేసి మంచి లాభాలను ఆర్జించవచ్చు.
25
పెట్టుబడి వివరాలు
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు రూ. 5 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో సెక్యూరిటీ డిపాజిట్, వర్కింగ్ క్యాపిటల్ కలిసి ఉంటాయి.
35
ఆదాయం ఎలా వస్తుంది?
ఏటీఎం బిజినెస్‌లో ప్రతి లావాదేవీపై మీకు కమిషన్ లభిస్తుంది. ఒక్క ట్రాన్సాక్షన్‌కి కమిషన్ సుమారు రూ. 20గా ఉంటుంది. ఒకవేళ మీ ఏటీఎంలో రోజుకు 300 ట్రాన్సాక్షన్లు జరిగితే.. రోజుకు రూ. 6,000 వరకు లాభం వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ. 1.80 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
ఖర్చులు(విద్యుత్ బిల్లు, అద్దె, ఇతర మెయింటెనెన్స్) కోసం నెలకు సుమారు రూ. 30,000 పోయినా, మీకు నెలకు రూ. 1.50 లక్షల నికర లాభం మిగులుతుంది. అంటే ఏడాదికి సుమారు రూ. 18 లక్షల వరకు సంపాదించవచ్చు.
55
ఇలాంటి ఫ్రాంచైజీలను..
ఏటీఎం ఏర్పాటు చేయడానికి కనీసం 60 నుంచి 100 చదరపు అడుగుల స్థలం ఉండాలి. అది జనం రద్దీ ఉండే ప్రదేశమైతే లావాదేవీలు ఎక్కువగా జరిగి లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. టాటా ఇండిక్యాష్(Tata Indicash), ముత్తూట్ ఏటీఎం(Muthoot ATM), ఇండియా వన్(India1) లాంటి సంస్థలు ఇలాంటి ఫ్రాంచైజీలను అందిస్తున్నాయి. వ్యాపార రంగంలో స్థిరమైన ఆదాయం కోరుకునేవారికి ఏటీఎం బిజినెస్ ఒక బెస్ట్ ఆప్షన్.