Post Office Scheme: ఒక్కసారి పెట్టుబడి.. ప్రతి నెలా రూ. 9 వేల ఆదాయం..

Published : Jul 07, 2025, 11:25 AM IST

Post Office Scheme:  బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్న ఈ సమయంలో, స్థిరమైన ఆదాయం కోరే వారికి పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (MIS) ఒక విశ్వసనీయ పెట్టుబడి. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. నెలనెలా స్థిర ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకం వివరాలు..

PREV
15
పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

ఇటీవల RBI వరుసగా రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులు సేవింగ్స్ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 0.25% తగ్గింపు, జూన్‌లో 0.50% తగ్గింపు, RBI రెపో రేటును 1.00% తగ్గించింది. దీని ఫలితంగా, బ్యాంకులు సేవింగ్స్ డిపాజిట్లపై రాబడిని తగ్గించాయి. అయితే, పోస్టాఫీస్ తన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ నేపథ్యంలో పెట్టుబడికి భద్రతతో పాటు స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకువారు పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ను పరిశీలించొచ్చు. ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ దంపతులకు, పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకాన్ని (MIS) మరింత ఆకర్షణీయంగా మారుతోంది. MIS లో ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా ₹9000 వరకు స్థిర వడ్డీ ఆదాయం పొందవచ్చు.  ఈ పథకం పూర్తి వివరాలు.. 

25
సురక్షితమైన పెట్టుబడి

పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (MIS).. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందొచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్‌ చేసిన సొమ్ముకు మార్కెట్‌తో సంబంధం ఉండదు. అంటే మీ డిపాజిట్‌ సేఫ్‌ అన్నమాట.   కాలావ్యవధి ముగిసిన తర్వాత, అసలు మొత్తం తిరిగి చెల్లించబడుతుంది. ఈ పథకం ముఖ్యంగా.. పదవీ విరమణ పొందినవారు, గృహిణులు, సాంప్రదాయ పెట్టుబడిదారులు కోసం అనుకూలంగా ఉంటుంది. వడ్డీ మొత్తం ప్రతినెలా పెట్టుబడిదారుల పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది.  

35
ఉమ్మడి ఖాతా పెట్టుబడి

పోస్టాఫీస్ MIS ప్రకారం.. ఒక్కొక్క ఖాతా గరిష్ట డిపాజిట్ పరిమితి  ₹9 లక్షలు కాగా, ఉమ్మడి ఖాతాలో ₹15 లక్షల వరకు పెట్టుబడి చేయొచ్చు. ఉదాహరణకు, దంపతులు ₹14.6 లక్షలు పెట్టితే, నెలకు ₹9003 వడ్డీ లభిస్తుంది. ఈ ఆదాయం పదవీ విరమణ లేదా అదనపు ఆదాయంగా ఉపయోగపడుతుంది. అసలు మొత్తం ఐదేళ్లపాటు సురక్షితం గా ఉండటమే కాకుండా మార్కెట్ ప్రభావాలను లోనుకాకుండా ఉంటుంది. 

45
వడ్డీ రేటు అధికం

పోస్టాఫీస్ MIS ప్రస్తుతం 7.4% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఇది స్థిర ఆదాయాన్ని కోరేవారికి సరైన ఎంపిక. ఈ పథకం మూలధనం, వడ్డీ రెండింటికీ ప్రభుత్వ మద్దతు హామీని అందిస్తుంది. మార్కెట్ పెరుగుదలలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. నెలవారీ ఆదాయం గృహ అవసరాలను తీర్చడంలో ఉపయోగపడుతుంది. తక్కువ డాక్యుమెంటేషన్‌తో, ఖాతా వ్యవస్థలో సులభంగా ట్రాక్ చేసుకునే వీలుంది. ఆదాయం నెలవారీగా అందించబడుతుంది.

55
గమనించాల్సిన విషయం

పోస్టాఫీస్ MIS నెలవారీ ఆదాయాన్ని అందించే విశ్వసనీయమైన పెట్టుబడి. అయినప్పటికీ, మీ పెట్టుబడి నిర్ణయాలు మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఈ స్థిర ఆదాయం వృద్ధులకూ, ఖచ్చితమైన ఖర్చుల ప్లానింగ్ చేసేవారికీ మేలుగా పనిచేస్తుంది. 

అయితే.. ఏ పెద్ద పెట్టుబడి ముందే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం. ప్రతి వ్యక్తికి ఆర్థిక స్థితి, రిస్క్ సామర్థ్యం భిన్నంగా ఉండవచ్చు. పైన తెలిపిన వివరాలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మీ డబ్బును ఐదేళ్లపాటు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. 

Read more Photos on
click me!

Recommended Stories