బంపర్ ఐపీవో, రేపే డ్రీమ్ ఫోక్స్ ఐపీవో లిస్టింగ్, రూ.100 ప్రీమియంతో లిస్ట్ అయ్యే చాన్స్..గ్రే మార్కెట్లో దూకుడు

First Published Sep 5, 2022, 1:26 PM IST

ఎయిర్‌పోర్ట్ సర్వీస్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ లిమిటెడ్ (DreamFolks Services IPO)IPO షేర్లు రేపు లిస్ట్ కానున్నాయి. డ్రీమ్‌ఫాక్స్ (DreamFolks Services IPO) స్టాక్ లిస్టింగ్ దాదాపు రూ.400 వద్ద అయ్యే అవకాశం ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

DreamFolks Services IPO  షేర్లు ఇప్పటికే గ్రే మార్కెట్ లిస్టింగ్‌లో ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. కంపెనీ ఐపీఓ (DreamFolks Services IPO)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ IPO 56.68 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. DreamFolks Services IPO మొత్తం 94,83,302 షేర్లకు గానూ 53,74,97,212 బిడ్లను అందుకుంది.

ఇది క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ (QIB) కేటగిరీలో 70.53 సార్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. అదే సమయంలో, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయబడిన భాగం 43.66 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. అదేవిధంగా నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ విభాగంలో 37.66 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి. DreamFolks Services IPO యొక్క ప్రతి ఈక్విటీ షేరు ధర 308 నుండి 326 గా నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ 253 కోట్లు సేకరించింది.

లైవ్ మింట్ నివేదిక ప్రకారం, గ్రే మార్కెట్‌లో సోమవారం DreamFolks Services ప్రీమియం రూ.110 అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆదివారం గ్రే మార్కెట్‌లో దీని ధర రూ.100 వద్ద ముగిసింది. గత వారం రోజులుగా గ్రే మార్కెట్‌లో DreamFolks Services ధర దాదాపు రూ.100 లాభంతో  ఉంది. అయితే ఈ కాలంలో స్టాక్ మార్కెట్ చాలా హెచ్చు తగ్గులను చవిచూసింది.
 

ప్రీమియం వద్ద లిస్టింగ్ అయ్యే అవకాశం
కంపెనీ బిజినెస్ మోడల్ దీర్ఘకాలంలో లాభపడుతుందని షేర్ ఇండియా వీపీ మరియు రీసెర్చ్ హెడ్ రవి సింగ్ అంటున్నారు. IPO లిస్టింగ్ దాని ఎగువ ధర బ్యాండ్ నుండి 20 నుండి 30 శాతం ప్రీమియంతో జరుగుతుందని సింఘాల్ చెప్పారు. షేర్లను రూ.312 నుండి రూ.412 మధ్య లిస్ట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. 

DreamFolks Services IPO లిస్టింగ్ రూ. 400 కంటే ఎక్కువగా ఉంటుందని ప్రొఫిషియెంట్ ఈక్విటీస్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మనోజ్ దాల్మియా చెప్పారు. DreamFolks Services IPO భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ సర్వీస్ అగ్రిగేటర్ అని దాల్మియా పేర్కొన్నారు. Visa, Mastercard, Diners/Discover, RuPayతో సహా భారతదేశంలో పనిచేస్తున్న అన్ని కార్డ్ నెట్‌వర్క్‌లకు DreamFolks సేవలను అందిస్తుంది.. IPO లిస్టింగ్ రూ. 408 నుండి 428 మధ్య ఉండవచ్చు.
 

DreamFolks Services IPO గురించి విశ్లేషకులు కూడా సానుకూలంగా ఉన్నారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ బలంగా ఉందని, కాబట్టి పెట్టుబడిదారులు ఇందులో డబ్బును పెట్టవచ్చని బ్రోకరేజ్ తెలిపింది. జైనమ్ బ్రోకింగ్ తన IPO నోట్‌లో కంపెనీ లాభదాయకంగా ఉందని, ఎటువంటి రుణం లేదని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఎలాంటి పోటీని ఎదుర్కోవడం లేదు. అందువల్ల, పెట్టుబడిదారులు దానిలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందవచ్చు. అన్‌లిస్టెడ్ ఎరీనా సహ వ్యవస్థాపకుడు అభయ్ దోషి కూడా పాజిటివ్ లిస్టింగ్‌కు అవకాశం ఉందని వ్యక్తం చేశారు.

click me!