బీచ్ సైడ్ విల్లా: 2022లో ముకేశ్ అంబానీ దుబాయ్‌లో పామ్ జుమేరాకు చెందిన లగ్జరీ ప్రాపర్టీని కొన్నారు. దుబాయ్‌లోని పామ్ జుమేరాలో 3,000 చదరపు అడుగుల భవనం చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం తీసుకున్నారు, ఇందులో పది బెడ్‌రూమ్‌లు, విశాలమైన డైనింగ్ ఏరియా, ఇండోర్ అండ్ అవుట్‌డోర్ పూల్స్, ప్రైవేట్ స్పా ఇంకా సెలూన్ ఉన్నాయి. దీనికి 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్‌కి ప్రత్యేక యాక్సెస్ ఉంది. 80 మిలియన్లు అంటే 650 కోట్లు పెట్టి దీనిని కొనుగోలు చేశారు.