మీరు కూడా అంబానీ ఫ్యామిలీలాగ పార్టీ చేసుకోవాలనుకుంటున్నారా ? ఎంత ఖర్చవుతుందో తెలుసా?

First Published | May 30, 2024, 10:47 PM IST

జూన్ నెలలో అంబానీ కుటుంబంలోని ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ  పెళ్లి జరగబోతోంది. గతంలో Celebrity Ascent అనే క్రూయిజ్‌ షిప్ లో వెడ్డింగ్ ఈవెంట్ ఉంటుందని వార్తలు వచ్చాయి. మరి మీరు కూడా ఇలాంటి పార్టీ చేసుకోవాలంటే ఎంత  ఖర్చు అవుతుందో తెలుసా...
 

భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఈ రోజుల్లో చర్చనీయాంశంగా మారారు. దీనికి కారణం తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి.
 

ఈ సంవత్సరం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ మార్చి 1 నుండి 3 వరకు జరిగింది. జామ్‌నగర్‌లో జరిగిన ఆ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో దేశంలోని ఇంకా ప్రపంచంలోని పెద్ద పెద్దలందరూ పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి అలంటి సెలబ్రేషన్‌ జరగబోతుంది.
 


ఈ క్రూయిజ్ పేరు సెలబ్రిటీ అసెంట్. దీని మొత్తం ధర గురించి చెప్పాలంటే, దీని విలువ రూ.7000 కోట్లు. దీని లోపల లభించే సౌకర్యాలు ఫైవ్ స్టార్ హోటల్ కంటే ఎక్కువ.
 

ఒక సామాన్యుడు ఈ  క్రూయిజ్‌లో ట్రిప్ బుక్ చేసుకోవాలంటే $681 డాలర్ల నుండి ప్రారంభమవుతుంది. భారతీయ రూపాల్లోకి మార్చుకుంటే దాదాపు రూ.57 వేలు.
 

కానీ ప్రయాణ మార్గం, ప్రయాణ సమయాన్ని బట్టి డబ్బు పెరుగుతుంది. ఉదాహరణకు, జూన్ 8న, ఈ క్రూయిజ్ బార్సిలోనా నుండి రోమ్‌కి 10 రోజుల ప్రయాణం పడుతుంది. ఈ ప్యాకేజీ ధర 11000 డాలర్లు అంటే దాదాపు 9,17,250 భారతీయ రూపాయలు.
 

అంబానీ కుటుంబం నిర్వహించే ఈ వెడ్డింగ్ ఈవెంట్ కి దాదాపు 800 మంది అతిథులు హాజరుకానున్నారు అని అంచనా. ఈ వెడ్డింగ్ కోసం క్రూయిజ్ ఇటలీలోని పలెర్మో పోర్ట్ ద్వారా 4380 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సౌత్ ఫ్రాన్స్‌కు చేరుకుంటుంది. ఇందుకోసం అంబానీ కుటుంబం డబ్బు చెల్లించిందా లేదా అనే దానిపై అధికారిక సమాచారం  లేదు.
 

Latest Videos

click me!