వెంటనే ఈ నంబర్లను మీ ఫోన్లో సేవ్ చేసుకోండి.. చాలా ఉపయోగపడుతుంది..

First Published | May 27, 2024, 11:37 PM IST

రైలు ప్రయాణంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదురుకొంటుంటారు. అలాంటప్పుడు ఫోన్‌లో ఈ ముఖ్యమైన నంబర్‌లను సేవ్ చేసుకోవడం  చాల  అవసరం.
 

ఇండియన్ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. దీనితో పాటు, ప్రయాణా సమయంలో తరచుగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతుంటాయి. రైలు స్టేటస్ తెలుసుకోవడానికి లేదా ట్రైన్   లొకేషన్ తెలుసుకోవడానికి భారతీయ రైల్వే హెల్ప్ నంబర్స్  తెలియక  అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
 

రైల్వేలో భద్రతకు సంబంధించిన సమస్యలతో పాటు కోచ్‌లలో శుభ్రత లేకపోవడం, పని చేయని లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు పనిచేయకపోవడం, బాత్‌రూమ్‌లలో నీరు లేకపోవడం వంటి సమస్యలను ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా వెంటనే పరిష్కరించుకోవచ్చు. ఈ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 గురించి కొందరికి తెలిసి ఉండకపోవచ్చు.
 


ఈ నంబర్  ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్. ఈ నంబర్ ద్వారా దాదాపు అన్ని రకాల సమస్యలను పరిష్కదించుకోవచ్చు.  ఈ నంబర్‌తో మీరు రైలు సేవల లోపాలు, రైల్వే సంబంధించిన ఇతర సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు.
 

ఈ నంబర్‌పై పన్నెండు భాషల్లో ఫిర్యాదులను రిజిస్టర్  చేయవచ్చు. IVRS అండ్ కాల్ సెంటర్ అధికారులతో కనెక్ట్ కావడం ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. కరెంటు, తాగునీటి సమస్యలతో పాటు టిక్కెట్లు లేకుండా రైళ్లలోకి ఎక్కడం, దొంగతనం వంటి ఫిర్యాదులను కూడా ఇక్కడ నివేదించవచ్చు. లైట్స్  సమస్యలు, క్లీనింగ్ కోసం మీరు 7208073768 లేదా 9904411439కి కాల్ చేసి మీ సమస్యను వారికి తెలియజేయాలి.
 

ఈ నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా, మీరు కోచ్ క్లీనింగ్, లైటింగ్ సమస్యలు, AC సమస్యలు ఇంకా  మురికిగా ఉన్న దుప్పట్లు, దిండ్లు కోసం పరిష్కారాలను పొందవచ్చు. ఇందుకు వారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేయాలి. మీ సమస్య త్వరలో పరిష్కారమవుతుంది. మీరు ఈ రెండు నంబర్లకు 7208073768 లేదా 9904411439కి కాల్ లేదా  మెసేజ్  పంపవచ్చు.
 

మెసేజ్ పంపడానికి మెసేజ్ బాక్స్‌కి వెళ్లి CLEAN అని వ్రాసి తరువాత 10-అంకెల PNRని ఎంటర్ చేయండి. దీని తర్వాత క్లీనింగ్ కోసం C సర్వీస్ కోడ్, వాటర్ కోసం W , కంట్రోల్ కోసం P, లైట్ ఎసికి E, చిన్న మరమ్మతులకు R అని రాసి మొబైల్ నంబర్ 7208073768 లేదా 9904411439కు పంపండి.
 

రైలు ప్రయాణంలో ప్రయాణీకులు 1323 నంబర్‌కు IRCTCకి కాల్ చేయడం ద్వారా వారికి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఈ సేవ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది. ఇంకా ప్రయాణీకుల సీట్ల వద్దకే ఫుడ్ అందిస్తుంది. అంతే కాకుండా, ప్రయాణీకులు IRCTC వెబ్‌సైట్‌లో ఫుడ్ కోసం కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.
 

Latest Videos

click me!