సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలవులు మొదలుకాగానే ప్రజలంతా పల్లె బాట పడుతుంటారు. దీంతో నేషనల్ హైవేలపై కార్లు ఓ రేంజ్‌లో బారులు తీరుతుంటాయి.
హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు నేషనల్ హైవేస్‌పై వాహనాలు బారులు తీరుతుంటాయి. ఇక సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో టోల్ గేట్స్ దగ్గర కార్లు క్యూ కడుతుంటాయి.
టోల్ గేట్స్ దగ్గర ఎక్కువ సేపు వేచి ఉండకూదన్న ఉద్దేశంతో ఫాస్టాగ్‌ను వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే పండగు నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.
సంక్రాంతి సమయంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఫాస్టాగ్‌ను సరి చూసుకోవాలని అధికారులు సూచించారు.
సాధారణంగా ఫాస్టాగ్‌ను చేయించిన తర్వాత కార్డులో మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్లాక్ లిస్టులో పడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణం ప్రారంభించే ముంచే ఫాస్టాగ్ బ్యాలెన్స్ తదితర వివరాలను చెక్ చేసుకోవాలని సూచించారు.
ఫాస్టాగ్‌లో సమస్యలు తలెత్తితే టోల్‌గేట్ వద్ద ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఇది వెనాల నుంచి వస్తున్న వాహనదారులకు కూడా ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా కారు ఫాస్టాగ్‌ను సరి చూసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ పీడీ నాగేశ్వర్‌రావు తెలిపారు.
ఇదిలా ఉంటే హైవేపై ప్రయాణం చేస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం సంభవించినా, అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే 1033 నెంబర్‌కు ఫోన్ చేస్త్ఏ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సాయం అందిస్తారని అధికారులు తెలిపారు.
కొందరు వాహనదారులు టోల్‌గేట్ వద్దకు వచ్చిన తర్వాత బ్యాలెన్స్ లేదన్న విషయం తెలుసుకొని రీఛార్జ్ చేసుకుంటున్నారని దీనివల్ల వాహనాల మూమెంట్ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే ఫాస్టాగ్ సంబంధిత వివరాలు చెక్ చేసుకోవాలని చెబుతున్నారు.