మీరు మీ ఇంటి లోన్ కట్టిన వెంటనే ఈ పనులు తప్పకుండా చేయండి, లేకుంటే ఇబ్బందుల్లో పడతారు!

First Published | Sep 16, 2023, 11:14 AM IST

 ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకో అనే సామెత వినే ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రెండు ముఖ్యమైన అంశాలు మాత్రమే కాదు, వాటికి చాలా డబ్బు కూడా అవసరం. ఇంటి  లోన్  కట్టడం  ఖచ్చితంగా అంత తేలికైన పని కాదు. దానికి  చాలా సమయం పడుతుంది. ఇంటి లోన్  చెల్లించిన వెంటనే ఒక పని  అయిపోయిందని ఊరికే కూర్చోలేరు. 

 ఇంటి లోన్  చెల్లించడం అనేది ఇల్లు  కొనుగోలుదారుకు ఖచ్చితంగా సంతోషకరమైన విషయం. కానీ, అలా ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే ముఖ్యమైన పనులు చేయడం మరిచిపోయినట్లే. ఇంటి లోన్ బ్యాంకుకు తిరిగి చెల్లించిన తర్వాత, కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటి లోన్  చెల్లించిన తర్వాత చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి.. ? ఏ డాకుమెంట్స్  పొందాలి..? అవి ఎందుకు ముఖ్యమైనవి..?  

NOC సర్టిఫికేట్  
మీరు హోమ్ లోన్ పూర్తిగా కట్టిన తర్వాత, మీరు బ్యాంకుకు  లోన్ క్లోజర్ స్టేట్‌మెంట్ లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోసం అడగాలి. దీనిని నో డ్యూస్ సర్టిఫికేట్ (NDC) అని కూడా అంటారు. NOC సర్టిఫికేట్‌లో హోమ్ లోన్ ఒప్పందం, EMI వివరాలు, అసలు బకాయిలు,  వడ్డీ, మొత్తం రాబడులు మొదలైన వివరాలు ఉంటాయి. లోన్ తిసుకున్న మీరు అన్ని బకాయిలను చెల్లించారని ఇంకా  లోన్ క్లోజ్ చేసినట్లు  అండ్ బ్యాంక్ కి మీ ఆస్తిపై ఎటువంటి తాత్కాలిక హక్కులు లేదా క్లెయిమ్‌లు లేవని కూడా ఈ సర్టిఫికేట్ పేర్కొనాలి. ఈ NOC పై సంతకం చేసినట్లు అలాగే బ్యాంక్ స్టాంప్ ఉండేలా చుసుకోండి.
 


ఒరిజినల్ డాక్యుమెంట్‌ 
 బ్యాంకు మీకు పంపే ఒరిజినల్ డాక్యుమెంట్‌ కి బదులు మిరే స్వయంగా వెళ్లి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్‌  తీసుకోవడం  మంచిది. దీని వల్ల బ్యాంకులో అన్ని డాకుమెంట్స్ చెక్ చేయడానికి అండ్ ఏ డాకుమెంట్స్ మిస్ కాకుండా చూసుకోవడానికి ఉంటుంది. ఏదైనా రిసిప్ట్ సంతకం చేసే ముందు ప్రతి డాక్యుమెంట్ లోని అన్ని పేజీలను  చెక్  చేయడం అవసరం. ఏదైనా పేజీ మిస్ అయ్యిందో లేదో  కూడా  తెలుస్తుంది. 

కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మీ ఆస్తిపై తాత్కాలిక హక్కులు తీసుకుంటాయి. అంటే, ఆస్తి యజమాని దానిని అమ్మడానికి ఉండదు. అందువల్ల, లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత లోన్  క్లోజ్ చేయడం అవసరం. దీని కోసం రిజిస్ట్రేషన్ అధికారి కార్యాలయాన్ని సందర్శించడం అవసరం. 
 

ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (EC) 
ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ ఆస్తికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీల రికార్డుగా పనిచేస్తుంది. కొత్త ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ జారీ చేసినప్పుడు, అది ఇంటి యాజమాన్యం బదిలీ, ఆస్తిపై ప్రస్తుత లోన్  అండ్  ఏదైనా లోన్  రిలీఫ్  గురించి సమాచారం  ఉంటుంది. ఈ సర్టిఫికేట్ కి  చట్టపరమైన ప్రాముఖ్యతను ఉంది అలాగే  ఆస్తి ఆర్థిక బాధ్యతల నుండి ఫ్రీ  అని చూపిస్తుంది.
 

క్రెడిట్ రిపోర్ట్‌ 
మీరు లోన్  చెల్లించిన తర్వాత, క్రెడిట్ బ్యూరోతో మీ క్రెడిట్ రికార్డ్‌ను అప్‌డేట్ చేయమని బ్యాంక్‌లో అడగండి. లోన్ సెటిల్మెంట్ చేసిన 30 రోజులలోపు ఈ అప్‌డేట్ ఉండేలా  చూసుకోండి. 
 

Latest Videos

click me!